దాదాపు 20 ఏళ్ల క్రితం పోయిన పర్సును పోలీసులు ఇంటికి తెచ్చివ్వడంతో ఓ వ్యక్తి సంభ్రమాశ్చర్యానికి గురయ్యాడు. ఈ సంఘటన ఐర్లాండ్‌లో చోటుచేసుకుంది. అక్కడి పోలీసులకు భూమిలో కూరుకుపోయిన ఓ పర్సు దొరికింది. దానిని తెరచి చూస్తే.. ఏటీఎం కార్డు, కొన్ని వివరాలు ఉన్నాయి. వాటి ఆధారంగా సంబంధిత వ్యక్తికి ఫోన్ చేస్తే.. తాను ఆ పర్సును 20 ఏళ్ల క్రితం పోగొట్టుకున్నట్లు చెప్పాడు.
20 ఏళ్ల క్రితం పోయింది... మళ్లీ తిరిగొచ్చింది... - natinal story
మనకు నచ్చిన, విలువైన వస్తువులు పోగొట్టుకుంటే చాలా బాధపడతాం. అవసరమైతే పోలీసులకు ఫిర్యాదు చేస్తాం. కొన్ని రోజులకు ఆ విషయాన్ని మర్చిపోతాం. కానీ, చాలా ఏళ్ల క్రితం పోగొట్టుకున్న వస్తువు అనుకోకుండా ఒక రోజు మన కళ్లముందు ప్రత్యక్షమైతే మన రియాక్షన్ ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. సరిగ్గా అలాంటి సంఘటనే ఐర్లాండ్‌లో జరిగింది.
purse found after 20 years in irland
ఆధారాలను సరిచూసుకొని ఆ పర్సును సదరు వ్యక్తికి ఇచ్చేసినట్లు పోలీసులు తెలిపారు. ‘‘ 20 ఏళ్ల మిస్టరీని 24 గంటల్లో ఛేదించాం’’ అంటూ సంబంధిత ఫొటోను పోలీసులు ఫేస్‌బుక్‌లో పోస్టు చేయడంతో, అది కాస్తా వైరల్‌గా మారింది. ‘‘ వాట్ ఏ గ్రేట్ న్యూస్, అద్భుతం, అసలు నమ్మలేకపోతున్నామే..!’’అంటూ పలువురు సరదాగా కామెంట్లు పెడుతున్నారు.