తెలంగాణ

telangana

అన్నార్థుల ఆకలి తీరుస్తున్న పర్పస్ ఛారిటబుల్ ట్రస్ట్

By

Published : May 27, 2021, 5:24 PM IST

కరోనా వ్యాప్తి కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం విధించిన లాక్​డౌన్​ వల్ల ఎంతో మంది రోడ్డున పడుతున్నారు. మరెంతో మంది కనీసం ఒకపూట తిండికి కూడా నోచుకోని దుస్థితిలో ఉన్నారు. ఇలాంటి వారందరికీ మేమున్నామంటూ ముందుకొచ్చి పొట్ట నింపుతున్నాయి కొన్ని స్వచ్ఛంద సంస్థలు. పేదల ఆకలి తీరుస్తూ వారి పాలిట వరంలా నిలుస్తున్నాయి.

purpose charitable trust, purpose charitable trust helping needy, telangana lock down
పర్పస్ ఛారిటబుల్ ట్రస్ట్, పేదలకు పర్పస్ ట్రస్ట్ చేయూత, తెలంగాణ లాక్​డౌన్

రాష్ట్రంలో విధించిన లాక్​డౌన్ వల్ల ఎంతో మంది పస్తులుండాల్సిన పరిస్థితి నెలకొంది. కొందరు ఉండటానికి నివాసం లేక వీధిన పడుతుంటే.. మరికొందరు ఒకపూట తిండికి కూడా నోచుకోని దుస్థితిలో కాలం వెళ్లదీస్తున్నారు. ఇలాంటి వారందరికి మేమున్నామంటూ కడుపు నింపుతున్నాయి కొన్ని స్వచ్ఛంద సంస్థలు. అలాంటి వాటిలో ఒకటే పర్పస్ ఛారిటబుల్ ట్రస్ట్. ఈ ట్రస్ట్ దాతల సాయంతో లాక్​డౌన్​లో ఎంతో మంది పేదల ఆకలి తీరుస్తోంది.

ఈరోజు దాదాపు 400 మందికి ఈ ట్రస్ట్ భోజనం ప్యాకెట్లు పంపిణీ చేసింది. ఐదు నుంచి 15 ఏళ్ల మధ్య వయస్సు గల 40 మంది బాలికలున్న లల్లన్న ఫౌండేషన్​కు రెండు నెలలకు సరిపడా నిత్యావసర సరుకులు అందజేసింది. దాతలు తాండవ కృష్ణ, బాబీ, పల్లిక నరేశ్​ల సాయంతో వీరందరికి చేయూతనందించినట్లు ట్రస్ట్ వ్యవస్థాపకుడు బ్లెస్సో శ్యామ్యూల్ తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details