తెలంగాణ

telangana

ETV Bharat / city

వంద నాణెంపై ఎన్టీఆర్‌ బొమ్మ.. ఆర్బీఐ గవర్నర్​తో చర్చించాం: పురందేశ్వరి - తిరుపతి జిల్లా తాజా వార్తలు

PURANDESWARI: ఏపీ తిరుపతి ఎస్వీ ఆడిటోరియంలో జరిగిన ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో మాజీ కేంద్ర మంత్రి, ఎన్టీఆర్‌ కుమార్తె పురందేశ్వరి పాల్గొన్నారు. వంద రూపాయల నాణెంపై నందమూరి తారకరామారావు బొమ్మను ముద్రించే అంశంపై ఆర్బీఐ గవర్నర్​తో చర్చించినట్లు తెలిపారు.

పురందేశ్వరి
పురందేశ్వరి

By

Published : Jun 10, 2022, 12:42 PM IST

PURANDESWARI:వంద రూపాయల నాణెంపై నందమూరి తారకరామారావు బొమ్మను ముద్రించే అంశంపై ఆర్బీఐ గవర్నర్​తో చర్చించామని మాజీ కేంద్ర మంత్రి, ఎన్టీఆర్‌ కుమార్తె పురందేశ్వరి అన్నారు. ఏపీ తిరుపతి ఎస్వీ ఆడిటోరియంలో జరిగిన ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో ఆమె పాల్గొన్నారు. ఎన్టీఆర్‌ శత జయంతి ఉత్సవాలు నిర్వహించాలని కుటుంబపరంగా నిర్ణయం తీసుకున్నామని.. స్థానిక కళాకారులని ఈ ఉత్సవాల ద్వారా ప్రోత్సహిస్తామని పేర్కొన్నారు.

వంద రూపాయల నాణెంపై ఎన్టీఆర్‌ బొమ్మ కోసం ప్రయత్నం: పురందేశ్వరి

ABOUT THE AUTHOR

...view details