తెలంగాణ

telangana

ETV Bharat / city

Sunitha letter reaction: సునీత లేఖ... మణికంఠరెడ్డిని విచారిస్తున్న పోలీసులు - మణికంఠరెడ్డిపై వివేకా కుమార్తె సునీత ఫిర్యాదు

తనకు, తన కుటుంబానికి ప్రాణహాని ఉందని ఏపీకి చెందిన మాజీ మంత్రి వివేకా కూతురు సునీత చేసిన ఫిర్యాదు మేరకు మణికంఠరెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడిని విచారిస్తున్నట్లు డీఎస్పీ శ్రీనివాసులు తెలిపారు.

Sunitha letter reaction: మణికంఠరెడ్డిని విచారిస్తున్న పోలీసులు
Sunitha letter reaction: మణికంఠరెడ్డిని విచారిస్తున్న పోలీసులు

By

Published : Aug 14, 2021, 4:04 PM IST

ఏపీకి చెందిన మాజీ మంత్రి వివేకానందరెడ్డి కుమార్తె సునీత ఫిర్యాదుతో వైకాపా నేత దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి అనుచరుడు మణికంఠరెడ్డిని పులివెందుల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నెల 10న తమ ఇంటి వద్ద మణికంఠ రెక్కీ నిర్వహించాడని సునీత ఫిర్యాదు చేశారు. ఈ మేరకు మణికంఠరెడ్డిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు డీఎస్పీ శ్రీనివాసులు తెలిపారు.

ఎస్పీకి ఫిర్యాదు..

తనకు, తన కుటుంబానికి ప్రాణహాని ఉంది.. వెంటనే భద్రత కల్పించాలని మాజీ మంత్రి వివేకా కుమార్తె సునీత నిన్న కడప ఎస్పీ కార్యాలయంలో లేఖ అందజేశారు. లేఖతో పాటు తమ ఇంటివద్ద రెక్కీ నిర్వహించిన దృశ్యాలతో కూడిన పెన్‌డ్రైవ్‌ అందజేశారు. డీఐజీ, డీజీపీలకు కూడా లేఖ పంపించారు.

ఈ నెల పదోతేదీన కడప జిల్లా పులివెందులలోని మా ఇంటివద్ద మణికంఠరెడ్డి అనే వ్యక్తి రెక్కీ చేశాడు. ఇతడు మా తండ్రి హత్యకేసులో అనుమానితుడు, వైకాపా నాయకుడు దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డికి ప్రధాన అనుచరుడు. ఇటీవల శివశంకర్‌రెడ్డి పుట్టినరోజు సందర్భంగా పులివెందులలో మణికంఠరెడ్డి చిత్రాలతో కూడిన ప్లెక్సీలు ఏర్పాటయ్యాయి. అతడు మా ఇంటిదగ్గర రెక్కీ చేయడం అనుమానాలకు తావిస్తోంది. సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా అనుమానితుడిని గుర్తించి ఇతడే ఆ ఫ్లెక్సీల్లోని వ్యక్తిగా నిర్ధారణకు వచ్చాను. దీనిపై పులివెందుల సీఐ భాస్కరరెడ్డికి ఈ నెల 12న సమాచారం అందించాను. ఆయన మా ఇంటికి వచ్చి సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించి, పనివారిని విచారించారు.

:-వివేకా కుమార్తె సునీత

ఇదీ చూడండి: 'రెక్కీ నిర్వహించారు.. మా ప్రాణాలు కాపాడండి'... ఎస్పీకి వైఎస్ వివేకా కుమార్తె సునీత లేఖ

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details