ఎన్నివేల కోట్లు ఖర్చైనా... రైతు పండించిన ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని ఎవరూ అధైర్యపడొద్దని ఫౌరసరఫరాల సంస్థ ఛైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. రైతుకు మనోధైర్యం ఇచ్చేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో చేయని సాహసం సీఎం చేస్తున్నారని కొనియాడారు.
'ఎంత ఖర్చయినా ప్రభుత్వమే ధాన్యం కొంటుంది'
రైతు పండించిన ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది.. ఎవరూ అధైర్యపడొద్దని ఫౌరసరఫరాల సంస్థ ఛైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. అందుకోసం దేశంలో ఎవరూ చేయని సాహసం సీఎం కేసీఆర్ చేస్తున్నారని వ్యాఖ్యానించారు.
'ఎంత ఖర్చైనా ప్రభుత్వమే ధాన్యం కొనుగోలు చేస్తుంది'
ధాన్యం సేకరణలో కొన్ని ఇబ్బందులు ఉన్నది వాస్తమేనని... అధిగమించేందుకు కృషి చేస్తున్నామని శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఈ యాసంగిలో 40 లక్షల ఎకరాల్లో పంట దిగుబడి వస్తుందని వెల్లడించారు. ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో తాలు సమస్య ఉందన్నారు. ధాన్యం సేకరణపై ఎప్పటికప్పుడు జిల్లా అధికారులతో మాట్లాడి సమన్వయం చేస్తున్నామని తెలిపారు.
TAGGED:
paddy purchase in telenaga