తెలంగాణ

telangana

ETV Bharat / city

'డబుల్ బెడ్​రూం ఇళ్ల కేటాయింపు పారదర్శకంగా జరగాలి'

సరూర్ నగర్ జీహెచ్​ఎంసీ సర్కిల్ కార్యాలయం వద్ద రంగారెడ్డి అర్బన్ జిల్లా భాజపా అధ్యక్షుడు సామ రంగారెడ్డి నేతృత్వంలో ధర్నా నిర్వహించారు. జీవో 131 ద్వారా తీసుకొచ్చిన ఎల్‌ఆర్‌ఎస్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. డబుల్ బెడ్​రూం ఇళ్ల కేటాయింపు పారదర్శకంగా జరగాలన్నారు.

protest to allocation of double bedroom houses should be done transparently and against lrs
'డబుల్ బెడ్​రూం ఇళ్ల కేటాయింపు పారదర్శకంగా జరగాలి'

By

Published : Oct 5, 2020, 6:55 PM IST

ఎల్‌ఆర్‌ఎస్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ.. రంగారెడ్డి అర్బన్ జిల్లా భాజపా అధ్యక్షుడు సామ రంగారెడ్డి నేతృత్వంలో సరూర్​నగర్ జీహెచ్​ఎంసీ సర్కిల్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వాహించారు. డబుల్ బెడ్​రూం ఇళ్ల కేటాయింపుపై పారదర్శకంగా విచారణ జరిపించి అర్హులైన లబ్ధిదారులకు కేటాయించాలని ఆందోళన చేపట్టారు.

ప్రజావ్యతిరేక పాలన కొనసాగిస్తోన్న తెరాస పార్టీని రాబోయే జీహెచ్​ఎంసీ ఎన్నికల్లో ఓడించి సీఎం కేసీఆర్​కు బుద్ధి చెప్పాలని గ్రేటర్ ప్రజలను కోరారు. ఎల్బీనగర్ నియోజకవర్గంలో డబుల్ బెడ్​రూం లబ్ధిదారులు అధిక సంఖ్యలో ఉండగా.. ప్రభుత్వం ఇప్పటివరకు నిర్మించింది కేవలం 500 డబుల్ బెడ్​రూంలు మాత్రమేనని పేర్కొన్నారు. అనంతరం జోనల్ కమిషనర్ విజయకృష్ణకు సామ రంగారెడ్డి వినతిపత్రం అందజేశారు.

ఇదీ చూడండి:45 రోజులైనా ఎల్పీజీ దహన వాటికలకు మోక్షం లభించలేదు!

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details