తెలంగాణ

telangana

ETV Bharat / city

విజయవాడ అగ్నిప్రమాదంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి

ఏపీలోని విజయవాడ స్వర్ణ ప్యాలెస్‌లో అగ్నిప్రమాదంపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అగ్నిప్రమాదంపై ఏపీ సీఎం జగన్‌కు ఫోన్‌ చేసిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. హోటల్‌ను ప్రైవేటు ఆస్పత్రి లీజుకు తీసుకుని కరోనా బాధితులను ఉంచిందని సీఎం వివరించారు.

pm modi shocked on vijayawada fire issue
విజయవాడ అగ్నిప్రమాదంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి

By

Published : Aug 9, 2020, 11:10 AM IST

ఏపీలోని విజయవాడ స్వర్ణ ప్యాలెస్‌ అగ్నిప్రమాదంపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని ట్వీట్ చేశారు.

అగ్నిప్రమాదంపై ఏపీ సీఎం జగన్‌కు ఫోన్‌ చేసిన ప్రధాని మోదీ... అగ్నిప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు. రూ.50 లక్షలు చొప్పున పరిహారం ప్రకటించామని ప్రధానికి సీఎం జగన్ తెలిపారు. హోటల్‌ను ప్రైవేటు ఆస్పత్రి లీజుకు తీసుకుని కరోనా బాధితులకు చికిత్స అందిస్తోందని సీఎం వివరించారు. అధికారులు వెంటనే సహాయక చర్యలను చేపట్టారని పేర్కొన్నారు. దురదృష్టవశాత్తు కొంతమంది మృత్యువాత పడ్డారని ప్రధానికి తెలిపారు.

ఇవీ చూడండి:ఆదివారం కరోనా పరీక్షలకు ఆటంకం.. మూడొంతుల కేంద్రాల మూత

ABOUT THE AUTHOR

...view details