ప్రజా సంఘాల నాయకులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని... ప్రజా కళా మండలి రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. ఆదివారం అనంతరంలో ప్రజా కళా మండలి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు విజయ్ అక్రమ అరెస్టును ఖండించారు. ఇంట్లో నుంచి బలవంతంగా తీసుకెళ్లి... ఇప్పటి వరకు సమాచారం ఇవ్వకపోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు.
'విజయ్‌ని విడుదల చేయాలి.. ఉపా చట్టం రద్దు చేయాలి' - ప్రజా కళా మండలి రాష్ట్ర కమిటీ డిమాండ్
ఏపీలోని అనంతపురంలో అక్రమంగా అరెస్టు చేసిన ప్రజా కళా మండలి రాష్ట్ర కమిటీ సభ్యుడు విజయ్ను వెంటనే విడుదల చేయాలని తెలంగాణ కమిటీ డిమాండ్ చేసింది. ప్రజా సమస్యలపై పోరాడుతున్నవారిపై పెట్టిన అక్రమ కేసులు వెంటనే ఎత్తివేయాలని కోరారు.
దేశవ్యాప్తంగా ప్రజా, మహిళ, హక్కుల, కార్మిక, విద్యార్థి, రచయితలు, మేథావులు, జర్నలిస్టులపై ఉపా చట్టం కింద కుట్రపూరితంగా అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు. ప్రజా సమస్యలపై చట్టబద్ధంగా పోరాడుతున్నవారిని... మావోయిస్టు అనుబంధ సంఘాల పేరిట ప్రభుత్వాలు వేధింపులకు గురిచేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే ఉపా చట్టాన్ని రద్దు చేయడంతోపాటు... రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలు రద్దు చేసి, కనీస మద్దతు ధర చట్టం తేవాలని డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి:ధరణిలో వ్యవసాయేతర ఆస్తుల నమోదుపై హైకోర్టులో విచారణ