తెలంగాణ

telangana

ETV Bharat / city

PV Sindhu: పీవీ సింధు ఫొటోతో ప్రత్యేక తపాలా కవర్‌ విడుదల - పీవీ సింధు ఫొటోతో ప్రత్యేక తపాలా కవర్‌

postal-department-honored-pv-sindhu-with-special-postal-cover-on-national-sports-day
postal-department-honored-pv-sindhu-with-special-postal-cover-on-national-sports-day

By

Published : Aug 29, 2021, 10:41 PM IST

Updated : Aug 29, 2021, 10:47 PM IST

22:07 August 29

జాతీయ క్రీడా దినోత్సవం పురస్కరించుకుని తపాలా కవర్‌ విడుదల

పీవీ సింధు ఫొటోతో ప్రత్యేక తపాలా కవర్‌ విడుదల

జాతీయ క్రీడా దినోత్సవం పురస్కరించుకుని తెలుగు తేజం పీవీ సింధును తపాలా శాఖ తనదైన పద్ధతిలో గౌరవించింది. బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి పీవీ సింధుపై గౌరవ సూచికంగా తపాలా శాఖ... ప్రత్యేక తపాలా కవర్‌ విడుదల చేసింది. చీఫ్‌ పోస్టుమాస్టర్‌ జనరల్‌ రాజేంద్రకుమార్‌ పీవీ సింధు చిత్రం ఉన్న తపాలా కవర్​ను విడుదల చేశారు. 2016లో రియో ఒలింపిక్స్‌, తాజాగా జరిగిన టోక్యో ఒలింపిక్స్ క్రీడల్లో పథకాలు సాధించి దేశ ప్రతిష్ఠను మరింత ఇనుమడింప చేసిందని ఈ సందర్భంగా ఆయన కొనియాడారు. ఇందుకు గౌరవంగా తెలంగాణ తపాలా సర్కిల్‌ ప్రత్యేక తపాలా కవర్‌ను విడుదల చేసినట్టు తెలిపారు. ఈ కవర్‌లు ఖైరతాబాద్‌ హెడ్‌ పోస్టు ఆఫీస్‌లో లభిస్తాయని తపాల శాఖ అధికారులు చెప్పారు. 

గర్వంగా ఉంది..

తన ఫొటోతో ప్రత్యేక తపాలా కవర్​ విడుదల చేయటం పట్ల పీవీ సింధు ఆనందం వ్యక్తం చేశారు. పీవీ సింధు ఇంట్లో పది వేల మంది అభిమానుల నుంచి ఈ- మెస్సేజ్​లు అందుకున్నారు. ఇంత మంది ప్రేమాభిమానాలు పొందటం ఎంతో గర్వంగా ఉందని హర్షం వ్యక్తం చేసింది.

గర్వకారణంగా నిలిచింది...

ఇటీవలే జరిగిన టోక్యో ఒలంపిక్స్​లో పీవీ సింధు కాంస్యం గెలుచుకుంది. అంతకుముందు జరిగిన రియో ఒలింపిక్స్​లో రజత పతకం కైవసం చేసుకుంది. వరుసగా రెండు పతకాలు తన ఖాతాలో వేసుకున్న మహిళగా రికార్డు సొంతం చేసుకుని దేశానికి గర్వకారణంగా నిలిచింది. 

ఇదీ చూడండి:

కొడుకును చిత్రహింసలు పెట్టి.. సెల్ఫీ వీడియో తీసి...

Last Updated : Aug 29, 2021, 10:47 PM IST

ABOUT THE AUTHOR

...view details