తెలంగాణలో ఏ మాత్రం బలం లేని భాజపా... వివిధ పార్టీలకు చెందిన నాయకులను పార్టీలోకి చేర్చుకుంటూ... బలపడుతున్నట్లు ఆ పార్టీ నేతలు కలలుగంటున్నారని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. కేంద్రం నుంచి పెద్ద మొత్తంలో నిధులు తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్ర ప్రజల మెప్పు పొందాలని కమలం నేతలకు పొన్నం సూచించారు. అది చేయకుండా ఇతర పార్టీల్లో అలకపూనిన వాళ్లను తీసుకొచ్చి పార్టీలో చేర్చుకుంటూ అటు కాంగ్రెస్ పార్టీని, ఇటు తెరాసలను విమర్శించడం ఆ పార్టీ నేతలకు అలవాటైందని విమర్శించారు. 2014 నుంచి ఇప్పటి వరకు తెలంగాణ కోసం కేంద్రం ఏమి చేసిందో చెప్పాలని.. భాజపా నేతలను ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ప్రధాన మంత్రి మోదీ, హోంమంత్రి అమిత్ షా తెలంగాణ అమరవీరులను, 60 సంవత్సరాల ప్రజల ఆకాంక్షలను అవమానపరిచే విధంగా మాట్లాడడంపై క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
తెలంగాణలో భాజపాకు బలం లేదు: పొన్నం
రాష్ట్రంలో భాజపాకు ఏ మాత్రం బలం లేదని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. ఇతర పార్టీల నాయకులను చేర్చుకుంటూ బలపడుతున్నామని కమల నేతలు కలలుగంటున్నారని ఎద్దేవా చేశారు.
తెలంగాణలో భాజపాకు బలం లేదు: పొన్నం