సీఎం కేసీఆర్‌పై మాజీ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య విమర్శలు గుప్పించారు. కేసీఆర్ ప్రాణం భాజపా చేతిలో, సీబీఐ చేతిలో ఉందని ఎద్దేవాచేశారు. దిల్లీలో యుద్ధం చేస్తానన్న కేసీఆర్.. ప్రధాని మోదీ కాళ్లపై పడ్డారని, మోదీని కలిసే సమయంలో కేసీఆర్ వెంట ఎంపీలు, అధికారులు లేకపోవడాన్ని పొన్నాల తప్పుబట్టారు. ఆగమేఘాల మీద కేసీఆర్ దిల్లీకి ఎందుకు వెళ్లారని పొన్నాల ప్రశ్నించారు. కేసీఆర్ తెలంగాణ ఆత్మగౌరవాన్ని దిల్లీలో తాకట్టు పెట్టారని ధ్వజమెత్తారు. కాళేశ్వరానికి జాతీయ హోదా కోసం దిల్లీ వెళ్లారనడం నాటకమన్నారు. డీపీఆర్ సమర్పించకుండా జాతీయహోదా వస్తుందా? అని ప్రశ్నించారు. పునర్విభజన చట్టం హామీలపై మోదీని ఎందుకు నిలదీయడం లేదు? అని పొన్నాల లక్ష్మయ్య ప్రశ్నించారు.
ముఖ్యమంత్రిపై పొన్నాల లక్ష్మయ్య గరంగరం - పొన్నాల తాజా వార్తలు
సీఎం కేసీఆర్‌పై కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య విమర్శలు గుప్పించారు. కేసీఆర్ ప్రాణం భాజపా చేతిలో ఉందని ఎద్దేవా చేశారు. దిల్లీ పర్యటన గురించి మీడియా ముందుకు వచ్చి మాట్లాడే ధైర్యం ఉందా అని ప్రశ్నించారు.
దిల్లీలో యుద్ధం చేస్తానన్న కేసీఆర్.. ప్రధాని కాళ్లపై పడ్డారు