ప్రముఖ సినీగేయ రచయిత, పద్మశ్రీ సిరివెన్నెల సీతారామ శాస్త్రి మరణం పట్ల గవర్నర్ తమిళిసై తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. సిరివెన్నెల సీతారామశాస్త్రి మరణవార్త తెలిసి చాలా బాధపడినట్లు తెలిపారు. ఆయన కుటుంబం, అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
పండిత పామరుల హృదయాలను గెలిచారు..
kcr on sirivennela:సిరివెన్నెల సీతారామ శాస్త్రి మరణం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఎటువంటి సంగీత ప్రక్రియలతోనైనా పెనవేసుకుపోయే అద్భుత సాహిత్యాన్ని సృష్టించిన సిరివెన్నెల.. పండిత పామరుల హృదయాలను గెలిచారని సీఎం అన్నారు. సినిమా పేరునే తన ఇంటిపేరుగా మార్చుకున్న ఆయన సాహిత్య ప్రస్థానం.. సామాజిక, సాంప్రదాయ అంశాలను స్పృశిస్తూ మూడున్నర దశాబ్దాల పాటు సాగిందని గుర్తు చేసుకున్నారు. సిరివెన్నెల సీతారామ శాస్త్రి మరణం, తెలుగు చలన చిత్ర రంగానికి, సంగీత సాహిత్య అభిమానులకు తీరని లోటన్నారు. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
ఇదీచూడండి:Sirivennela died: ప్రముఖ గీత రచయిత సిరివెన్నెల ఇకలేరు
తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది..
Kishan reddy on Sirivennela: సిరివెన్నెల సీతారామశాస్త్రి మరణించారన్న వార్త తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి అన్నారు. సినీరంగంలో అనేక అవార్డుల సహా పద్మశ్రీ పొందారని గుర్తుచేసుకున్నారు. సీతారామశాస్త్రి మృతి పట్ల వారి కుటుంబ సభ్యులు, అభిమానులకు ప్రగాఢ సంతాపం, సానుభూతిని తెలియజేస్తున్నానని.. సిరివెన్నెల ఆత్మకు శాంతి కలగాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నానని కిషన్రెడ్డి పేర్కొన్నారు.
తెలుగు సాహితీ లోకానికి తీరని లోటు..
సిరివెన్నెల మృతిపట్ల మంత్రి కేటీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. పాటల ద్వారా సమాజంలో చైతన్యం నింపారని కొనియాడారు. సిరివెన్నెల కోట్లాది అభిమానులను సంపాదించుకున్నారని తెలిపారు. ఆయన మరణం తెలుగు సాహితీ లోకానికి తీరని లోటన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నానని.. సిరివెన్నెల కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని కేటీఆర్ తెలిపారు.
ఇదీచూడండి:SiriVennela Died: పాటల మాంత్రికుడు, సాహితీ విమర్శకుడు!
సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు..