తెలంగాణ

telangana

ETV Bharat / city

janasena: విశాఖలో జనసేన బహిరంగ సభకు పోలీసుల అనుమతి - జనసేన

ఏపీలోని విశాఖలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పవన్ ఆదివారం బహిరంగ సభ నిర్వహించనున్నారు. అయితే దీనికి పోలీసులు మొదట అనుమతి నిరాకరించారు. ఈ నేపథ్యంలో జనసైనికులు స్టీల్ ప్లాంట్ ప్రధాన ద్వారం వద్ద టెంట్ ఏర్పాటు చేసి ఆందోళన చేపట్టారు. జనసైనికుల నిరసనతో.. బహిరంగసభకు విశాఖ పోలీసులు అనుమతి మంజూరు చేశారు.

Janasena public meeting
Janasena public meeting

By

Published : Oct 30, 2021, 8:50 PM IST

ఏపీలోని విశాఖలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జనసేన నిర్వహించనున్న బహిరంగసభకు విశాఖ పోలీసులు అనుమతి ఇచ్చారు. ఈ నెల 31న విశాఖలో బహిరంగ సభ పెట్టాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ నిర్ణయించగా.. మొదట పోలీసులు అనుమతి నిరాకరించారు.

ఈ నేపథ్యంలో జనసైనికులు స్టీల్ ప్లాంట్ ప్రధాన ద్వారం వద్ద టెంట్ ఏర్పాటు చేసి ఆందోళన చేపట్టారు. జనసైనికుల నిరసనతో.. బహిరంగసభకు విశాఖ పోలీసులు అనుమతి మంజూరు చేశారు.

ఇదీ చూడండి:ఈటీవీ భారత్​ కథనానికి స్పందన.. కలెక్టర్​కు బాలల కమిషన్​ నోటీసులు

ABOUT THE AUTHOR

...view details