తెలంగాణ

telangana

ETV Bharat / city

Govindananda Saraswati: తిరుపతిలో గోవిందానంద సరస్వతిని అడ్డుకున్న పోలీసులు - హనుమత్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు వ్యవస్థాపకులు గోవిందానంద సరస్వతి

Govindananda Saraswati: తిరుపతిలో అలిపిరి గరుడ కూడలి వద్ద గోవిందానంద సరస్వతి యాత్రను పోలీసులు అడ్డుకున్నారు. హనుమంతుడి జన్మస్థలంగా అంజనాద్రిని వ్యతిరేకించిన ఆయన.. హనుమాద్​ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్​ ఆధ్వర్యంలో 4 రోజుల క్రితం రథయాత్ర చేపట్టారు.

Govindananda Saraswati, hanuman birth place
గోవిందానంద సరస్వతిని అడ్డుకున్న పోలీసులు

By

Published : Feb 18, 2022, 2:54 PM IST

Govindananda Saraswati: తిరుపతిలో హనుమాద్​ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్​ వ్యవస్థాపకులు గోవిందానంద సరస్వతిని పోలీసులు అడ్డుకున్నారు. అలిపిరి గరుడ కూడలి వద్ద గోవిందానంద యాత్రను అడ్డుకున్నారు. అంజనాద్రిని హనుమంతుడు జన్మస్థలంగా ప్రకటించడాన్ని గోవిందానంద సరస్వతి వ్యతిరేకించారు.

Govindananda Saraswati on hanuman birth place : హనుమంతుడు తిరుమలలోని అంజనాద్రిలో పుట్టలేదని... కర్ణాటక రాష్ట్రం కిష్కింధలోని పంపానది క్షేత్రంలోనే జన్మించారని హనుమాద్​ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ వ్యవస్థాపకులు గోవిందానంద సరస్వతి స్పష్టం చేశారు. ట్రస్ట్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా నిర్వహించనున్న రథయాత్ర వాహనాన్ని ఆయన తిరుపతిలో ప్రారంభించారు.

తితిదే దైవద్రోహం చేస్తోంది...

తితిదే దైవద్రోహం చేస్తోందని.. హనుమంతుని జన్మస్థలం పేరుతో నకలీ పుస్తకాన్ని ముద్రించిందని గోవిందానంద సరస్వతి ఆరోపించారు. తితిదే పాలకమండలి నాటకం ఆడుతోందని... సన్యాసులను, ప్రజలను తితిదే మోసం చేస్తోందన్నారు. అంజనాద్రి పేరుతో నిర్మాణాలు చేయడం ద్వారా.. దుకాణాలు ఏర్పాటు చేసి డబ్బులు సంపాదించేందుకు తితిదే ప్రయత్నిస్తోందని విమర్శించారు. 1200 కోట్ల రూపాయలతో కిష్కింధను అభివృద్ధి చేయనున్నట్లు కర్ణాటక ముఖ్యమంత్రి ప్రకటించారని తెలిపారు. కిష్కింధ హనుమంతుని జన్మస్థలమని ప్రజలకు తెలియజేసేందుకు హనుమాద్​ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో 12 సంవత్సరాల పాటు దేశవ్యాప్తంగా రథయాత్ర చేపడుతున్నట్లు ఆయన తెలిపారు.

ఇదీ చదవండి :కేసీఆర్​ ప్రధాని కావాలని మొక్కుకున్నా: మంత్రి మల్లారెడ్డి

ABOUT THE AUTHOR

...view details