భాజపా నేత బుడ్డా శ్రీకాంత్‌రెడ్డి పర్యటనలో ఉద్రిక్తత.. గాల్లోకి కాల్పులు - police gun fire into air
20:09 January 08
భాజపా నేత బుడ్డా శ్రీకాంత్‌రెడ్డి పర్యటనలో ఉద్రిక్తత.. గాల్లోకి కాల్పులు
TensionatAtmakur City:ఏపీలోని కర్నూలు జిల్లా ఆత్మకూరు పట్టణంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఓ నిర్మాణం విషయంలో సాయంత్రం రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకోవటంతో.. రాళ్లు రువ్వుకున్నారు. అదే సమయంలో అక్కడికి వచ్చిన భాజపా నేత బుడ్డా శ్రీకాంత్ రెడ్డిని ఓ వర్గంవారు అడ్డుకున్నారు. ఈ క్రమంలో శ్రీకాంత్ రెడ్డి కారు ఒక్కసారిగా మనుషులపైకి వెళ్లటంతో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. దీంతో ఆగ్రహానికి గురైన మరో వర్గం... శ్రీకాంత్ రెడ్డి కారును ధ్వంసం చేశారు. పరిస్థితిని అదుపుచేసేందుకు పోలీసులు.. గాల్లోకి రెండు రౌండ్లు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి.
ఇదీ చదవండి: