పోలీసులపై కుక్కలను వదిలిన పీవీపీ - police file case on pvp
15:23 June 29
పోలీసులపై కుక్కలను వదిలిన పీవీపీ
సినీ నిర్మాత, వైసీపీ నేత ప్రసాద్ వి.పొట్లూరి(పీవీపీ)పై బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. ఇటీవల పీవీపీపై నమోదైన ఒక కేసు విచారణకు సంబంధించి పలువురు పోలీసులు ఆయన ఇంటికి వెళ్లారు. ఈ క్రమంలో వారిపైకి పీవీపీ తన పెంపుడు కుక్కలను ఉసిగొల్పారు. ఈ హఠాత్పరిణామంతో ఖంగుతున్న పోలీసులు ఆయన ఇంటి నుంచి బయటకు వచ్చేశారు. ఈ ఘటనపై జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. విచారణకు వెళ్తే తమపై కుక్కలను ఉసిగొల్పారని ఎస్సై హరీశ్‌రెడ్డి ఫిర్యాదు చేయగా, ఐపీసీ 353కింద పీవీపీపై కేసు ఫైల్ చేశారు.
గతవారం పీవీపీపై బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో ఓ వ్యక్తి ఫిర్యాదు చేశాడు. ఇంటి నిర్మాణాన్ని అడ్డుకుని దౌర్జన్యం చేస్తున్నారంటూ సదరు వ్యక్తి ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఇందులో భాగంగా జూబ్లీహిల్స్‌లోని రోడ్ నెం.82లో ఉన్న పీవీపీ ఇంటికి పోలీసులు వెళ్లగా, ఈ ఘటన చోటు చేసుకుంది.
ఇవీ చూడండి: పీపీఈ కిట్ల ఎగుమతికి కేంద్రం ఓకే