తెలంగాణ

telangana

ETV Bharat / city

విజయవాడ గ్యాంగ్‌వార్‌ కేసులో మరో ఆరుగురు అరెస్టు

సంచలన సృష్టించిన విజయవాడ గ్యాంగ్​వార్​ కేసులో పోలీసులు మరో ఆరుగురిని అరెస్ట్ చేశారు. ఇప్పటి వరకు ఈ కేసులో ప్రధాన నిందితుడితో పాటు మెుత్తం 33 మందిని అరెస్ట్ చేశారు. ఘర్షణకు సంబంధించి ఇప్పటికే జూన్‌ 5న తోట సందీప్‌ హత్య కేసులో 13 మందిని, జూన్‌ 8న కొండూరు మణికంఠ అలియాస్‌ పండుపై హత్యాయత్నం కేసులో 11 మందిని, జూన్‌ 10న మరో 9 మందిని, 13న ప్రధాన నిందితుడు కొండూరు మణికంఠ అలియాస్‌ పండును అరెస్టు చేశారు.

By

Published : Jul 7, 2020, 7:31 AM IST

విజయవాడ గ్యాంగ్‌వార్‌ కేసులో మరో ఆరుగురు అరెస్టు
విజయవాడ గ్యాంగ్‌వార్‌ కేసులో మరో ఆరుగురు అరెస్టు

ఏపీలోని విజయవాడ పట్టణ కేంద్రం పటమటలో బహిరంగ స్థలంలో రెండు గ్రూపుల మధ్య జరిగిన గ్యాంగ్‌వార్‌ కేసులో మరో ఆరుగురు నిందితులను పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. పటమట తోటవారి వీధికి చెందిన పురం చైతన్య అలియాస్‌ బుడ్డి (26), కానూరు వసంత్‌నగర్‌కు చెందిన మాచర్ల సాగర్‌ (24), పటమట డొంక రోడ్డుకు చెందిన పులగం జూసి ప్రభుకాంత్‌ (29), యనమలకుదురు ఇందిరానగర్‌-1కు చెందిన కందుల అనిల్‌ కుమార్‌ (27), పటమట పోస్టల్‌ కాలనీకి చెందిన ఎర్రంశెట్టి ఆదిశేషు (21), పటమట రెల్లీస్‌ కాలనీకి చెందిన ముత్యాల కుమారస్వామి అలియాస్‌ చంబు (19)ను పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి ఐదు సెల్‌ఫోన్లు, ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.

ఈ ఘర్షణకు సంబంధించి ఇప్పటికే జూన్‌ 5న తోట సందీప్‌ హత్య కేసులో 13 మందిని, జూన్‌ 8న కొండూరు మణికంఠ అలియాస్‌ పండుపై హత్యాయత్నం కేసులో 11 మందిని, జూన్‌ 10న మరో 9 మందిని, 13న ప్రధాన నిందితుడు కొండూరు మణికంఠ అలియాస్‌ పండును అరెస్టు చేశారు. జూన్‌ 14న కొట్లాటకు, రెండు కేసులకు కారణమైన మరో ముగ్గురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు పంపించారు. నగర పోలీస్‌ కమిషనర్‌ బత్తిన శ్రీనివాసులు ఆదేశాల మేరకు డీసీపీ హర్షవర్థన్‌రాజు ఆధ్వర్యంలో సెంట్రల్‌ ఏసీపీ పి.నాగరాజారెడ్డి పర్యవేక్షణలో పటమట సీఐ రావి సురేష్‌రెడ్డిలు ఈ కేసులకు సంబంధించి నిందితులను అరెస్టు చేశారు.

ఇదీ చదవండి: పోలీసులనే ఆటకు పిలిచిన పేకాటరాయుళ్లు

ABOUT THE AUTHOR

...view details