రాష్ట్రప్రభుత్వం బ్లాక్ ఫంగస్ ఔషధాలను సమకూర్చకపోవడాన్ని సవాల్ చేస్తూ... హైకోర్టులో అత్యవసర ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ఆంఫోటిరిసిన్ బీ ఇంజక్షన్లు.... తగినంత కేటాయించేలా కేంద్రాన్ని ఆదేశించాలని కోరుతూ న్యాయవాది జయంత్ జైసూర్య హౌజ్ మోషన్ దాఖలు చేశారు. గ్లోబల్ టెండర్ల ద్వారా సేకరించేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు.
రాష్ట్రంలో బ్లాక్ ఫంగస్ ఔషధాలపై హైకోర్టులో పిల్ - telangana latest news
రాష్ట్ర ప్రభుత్వం బ్లాక్ ఫంగస్ ఔషధాలను సమకూర్చకపోవడాన్ని సవాల్ చేస్తూ... హైకోర్టులో అత్యవసర ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. బ్లాక్ ఫంగస్ కేసుల వివరాలను ప్రభుత్వం సరిగా వెల్లడించకపోవడాన్ని పిటిషన్‌లో పేర్కొన్నారు న్యాయవాది జయంత్ జైసూర్య. దీనిపై నేడు విచారణ జరిగే అవకాశం ఉంది
బ్లాక్ ఫంగస్ కేసుల వివరాలను సరిగా వెల్లడించకపోవడం వల్ల కేంద్రం తగినంత ఔషధాలు కేటాయించడం లేదని పిటిషనర్ పేర్కొన్నారు. బ్లాక్ ఫంగస్ తీవ్రత ఎక్కువగా ఉందని చెబుతూనే....... మందుల సేకరణకు ప్రయత్నించడం లేదన్నారు. బ్లాక్ ఫంగస్ చికిత్సకు అవసరమయ్యే ఇంజక్షన్ల కోసం డీఎంఈ నేతృత్వంలోని కమిటీకి దరఖాస్తు చేసుకోవాలని ఆదేశించారని... ఐతే సకాలంలో ఔషధాలు అందక ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని పిటిషన్‌లో పేర్కొన్నారు. న్యాయవాది దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై నేడు విచారణ జరిగే అవకాశం ఉంది.
ఇవీ చూడండి:కరోనా పరీక్షలు మరింత పెంచాలి: సీఎం కేసీఆర్