Tirumala vaikunta dwara darshan: జనవరి 13 నుంచి 22వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనానికి అనుమతివ్వనున్నట్లు.. తితిదే అదనపు ఈవో ధర్మారెడ్డి తెలిపారు. ఒమిక్రాన్ నేపథ్యంలో దర్శనాల సంఖ్య పెంచలేదని.. రోజుకు 45 వేలమంది శ్రీవారిని దర్శించుకునేలా ఏర్పాట్లు చేశామన్నారు. తిరుమల, తిరుపతి స్థానికులకు ఆఫ్‌లైన్‌లో 5 వేల సర్వదర్శన టోకెన్లు జారీ చేయనుండగా.. స్థానికేతరులకు ఆఫ్‌లైన్‌లో సర్వదర్శన టోకెన్లు జారీ చేయనున్నారు. దర్శన టికెట్లు లేని భక్తులను తిరుమలకు అనుమతించమని ఆయన స్పష్టం చేశారు. వైకుంఠ ఏకాదశి రోజున రాత్రి 2 గంటలకు దర్శనాలు ప్రారంభమవుతాయని.. భక్తులు కొవిడ్ నెగిటివ్, టీకా సర్టిఫికెట్లు తప్పనిసరిగా తీసుకురావాలని సూచించారు. వైకుంఠ ఏకాదశి రోజూ.. శ్రీవాణి ట్రస్టు భక్తులకు రూ.300 దర్శన టోకెన్లు ఇవ్వనున్నట్లు తెలిపారు.
వీఐపీ సిఫార్సులు స్వీకరించబోం