తెలంగాణ

telangana

ETV Bharat / city

మొదటి విడతలో 25,649 పీజీ సీట్లు భర్తీ

రాష్ట్రంలోని పలు పీజీ కళాశాలల్లో మొదటి విడత సీట్లు భర్తీ అయ్యాయి. 25,649 సీట్లు భర్తీ కాగా... మరో 12,410 పీజీ సీట్లు మిగిలాయి. మొదటి విడతలో సీటు వచ్చిన విద్యార్థులు ఈనెల 17 వరకు ఆన్​లైన్​లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలని కన్వీనర్ ప్రొఫెసర్ కిషన్ తెలిపారు.

pg seats allotment in telangana
pg seats allotment in telangana

By

Published : Feb 12, 2021, 9:20 PM IST

రాష్ట్రంలో మొదటి విడతలో 25,649 పీజీ సీట్లు భర్తీ కాగా... మరో 12,410 పీజీ సీట్లు మిగిలాయి. ఉస్మానియా, కాకతీయ, శాతవాహన, మహాత్మ గాంధీ, పాలమూరు, తెలంగాణ యూనివర్సిటీల్లో ఎంకాం, ఎంఎస్సీ, ఎంఏ వంటి సంప్రదాయ పీజీ కోర్సులు కన్వీనర్ కోటాలో 38,059 సీట్లు ఉన్నాయి. సీపీగెట్​లో ఉత్తీర్ణులైన 40,182 మంది విద్యార్థులు వెబ్ ఆప్షన్లు ఇచ్చారు.

మొదటి విడతలో సీటు వచ్చిన విద్యార్థులు ఈనెల 17 వరకు ఆన్​లైన్​లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలని కన్వీనర్ ప్రొఫెసర్ కిషన్ తెలిపారు. ఒకవేళ రెండో విడత కౌన్సెలింగ్​లో పాల్గొనే ఆలోచన లేకపోతే కాలేజీకి వెళ్లి రిపోర్టింగ్ చేయవచ్చునని ఆయన సూచించారు. కాలేజీల్లో టీసీ మినహా మిగతా ఒరిజినల్ సర్టిఫికెట్లు ఇవ్వాల్సిన అవసరం లేదని కన్వీనర్ పేర్కొన్నారు.

ఇదీ చూడండి:'రైతు కుటుంబానికి ధీమా ఇస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆరే'

ABOUT THE AUTHOR

...view details