భారత్‌లో ఇంధన ధరల పెంపు కొనసాగుతోంది. వరుసగా నాలుగో రోజు పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. ఆదివారం.. దిల్లీలో (Fuel Price Today) లీటర్ పెట్రోల్ ధర 25 పైసలు పెరగ్గా.. డీజిల్‌పై 30 పైసలు పెరిగింది. ఈ మేరకు చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో దిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.102.39కి చేరగా.. డీజిల్ ధర రూ.90.78కి పెరిగింది.
ఆగని పెట్రో మంట- నాలుగో రోజూ పెరిగిన ధరలు
దేశంలో ఇంధన ధరలు (Fuel Price Today) పరుగులు పెడుతున్నాయి. లీటర్ పెట్రోల్‌పై 25 పైసలు, డీజిల్‌పై 30 పైసలు పెంచుతున్నట్లు చమురు సంస్థలు తెలిపాయి.
ఆగని పెట్రో మంట- నాలుగో రోజూ పెరిగిన ధరలు
దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో ప్రస్తుతం పెట్రోల్ ధర రూ.108.39గా ఉంది. డీజిల్ ధర రూ.98.44కి చేరింది.
తెలుగు రాష్ట్రాల్లో...
- హైదరాబాద్‌లో (Petrol Price in Hyderabad) పెట్రోల్ లీటర్ ధర 26 పైసలు పెరిగింది. ఫలితంగా ప్రస్తుతం లీటర్ ధర రూ.106.47కు చేరుకుంది. మరోవైపు డీజిల్ ధర 32 పైసలు అధికమై.. లీటర్‌కు రూ.99.00కు చేరింది.
- విశాఖపట్నంలో (Petrol Price in Vizag) 25 పైసలు పెరిగిన లీటర్ పెట్రోల్ ధర.. రూ.107.40కు చేరుకుంది. డీజిల్‌పై 32 పైసలు పెరిగి.. రూ.99.42కు చేరింది.
- గుంటూరులో (Petrol Price in Guntur) పెట్రోల్ ధర 26 పైసలు ఎగబాకింది. ప్రస్తుతం లీటర్ ధర రూ.108.67గా ఉంది. డీజిల్ లీటర్‌కు 32 పైసలు పెరిగి.. రూ.100.65 వద్ద ఉంది.
TAGGED:
dummy