తెలంగాణ

telangana

ETV Bharat / city

లాక్​డౌన్​ ఎఫెక్ట్: భారీగా పడిపోయిన చమురు విక్రయాలు

పెట్రోలు పోయించుకోవాలంటే చాలా సమయం వెచ్చించాల్సి వస్తుందనేది... నిన్న మొన్నటి వరకు మాట... కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. నిత్యం వాహనాలతో రద్దీగా ఉండే పెట్రోల్​ బంకులు లాక్‌డౌన్‌ కారణంగా వెలవెలబోతున్నాయి. నిత్యావసర సరుకులు తరలించే వాహనాలు మినహా అన్ని ఆగిపోయాయి. పెట్రోల్‌, డీజిల్‌ విక్రయాలు పడిపోయాయని తెలంగాణ పెట్రోల్‌ డీలర్స్‌ అసోసియేషన్‌ వెల్లడించింది.

petrol and diesel selling down fall in telangana
లాక్​డౌన్​ ఎఫెక్ట్: భారీగా పడిపోయిన చమురు విక్రయాలు

By

Published : Apr 10, 2020, 2:01 AM IST

తెలంగాణలో పెట్రోల్‌, డీజిల్‌ అమ్మకాలు భారీగా పడిపోయాయి. రాష్ట్రంలోని 3వేలకు పైగా పెట్రోల్‌ పంపుల్లో రోజువారీగా జరిగే అమ్మకాల్లో 40శాతం కూడా జరగడం లేదని తెలంగాణ పెట్రోల్‌ డీలర్ల అసోసియేషన్‌ అధ్యక్షుడు అమరేంద్ర రెడ్డి తెలిపారు. 2019 ఏప్రిల్‌ 1 నుంచి 7 వరకు జరిగిన పెట్రోల్‌, డీజిల్‌ విక్రయాలతో బేరీజు వేసుకుంటే పెట్రోల్‌ 65శాతం, డీజిల్‌ 69శాతం పడిపోయినట్లు గణాంకాలు వెల్లడించాయి.

గతంలో రాష్ట్ర వ్యాప్తంగా 2,13,8000 లీటర్లు పెట్రోల్‌ అమ్మకాలు జరిగాయి. కానీ ఇప్పుడు కేవలం 74,82,000 లీటర్లు మాత్రమే అమ్ముడు పోయింది. 1,38,27,000 లీటర్లు తగ్గినట్టు చమురు సంస్థల అధికారిక లెక్కలు వెల్లడిస్తున్నాయి. సాధారణ రోజుల కంటే 64.89 శాతం మేర విక్రయాలు పడిపోయాయి. అదే విధంగా 4,36,22,000 లీటర్లు డీజిల్‌ అమ్ముడు పోగా ఇప్పుడు కేవలం 1,35,82,000 లీటర్లు మాత్రమే విక్రయాలు జరిగినట్లు చమురు సంస్థలు తెలిపాయి. అంటే 3,00,40,000 లీటర్లు అమ్మకాలు పడిపోయినట్టు అధికారిక గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. మొత్తంగా 68.87శాతం అమ్మకాలు తగ్గినట్టు చమురు సంస్థలు వెల్లడించాయి.

రోజువారీగా జరగాల్సిన విక్రయాలు లేకపోవడం వల్ల పెట్రోల్‌ పంపుల్లో పని చేసే సిబ్బంది... ఆటలు ఆడుతూ కాలయాపన చేస్తున్నారు. లాక్‌డౌన్‌ ప్రభావం పెట్రోల్‌, డీజిల్‌పై తీవ్ర ప్రభావం చూపుతోందని డీలర్లు అభిప్రాయపడుతున్నారు.

ఇవీ చూడండి:వరి కోతలను బట్టి దశల వారీగా కొనుగోలు కేంద్రాలు'

ABOUT THE AUTHOR

...view details