రాష్ట్రంలో ఇంధన ధరలు మరోసారి స్వల్పంగా పెరిగాయి. లీటర్ పెట్రోల్‌పై 25 పైసలు, డీజిల్‌పై 17 పైసల పెరుగుదల నమోదైంది. హైదరాబాద్‌లో ఇవాళ లీటరు పెట్రోలు ధర రూ.94.79పైసలు, డీజిల్ ధర రూ.88.86పైసలకు చేరింది. గత మూడ్రోజుల్లో ఎలాంటి పెరుగుదల లేకపోగా.. శనివారం ధరలు పెరిగాయి.
30రోజుల్లో రాష్ట్రంలో రూ.5 పెరిగిన పెట్రోల్ ధర - హైదరాబాద్‌లో పెట్రోల్ ధర
పెట్రో ధరలు భగ్గుమంటున్నాయి. మూడ్రోజుల తర్వాత రాష్ట్రంలో మళ్లీ పెట్రోల్ రేట్లు పెరిగాయి. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.94.79 పైసలకు చేరిగా.. డీజిల్ రూ.88.86గా ఉంది.
మూడ్రోజుల తర్వాత మళ్లీ పెరిగిన పెట్రో, డీజిల్ ధరలు
ఫిబ్రవరి ఒకటో తేదీ ధరలతో పోలిస్తే.. హైదరాబాద్‌లో పెట్రోల్‌పై రూ.5.02పైసలు, డీజిల్‌పై రూ.5.40 పైసల పెరుగుదల కనిపిస్తుంది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల హెచ్చుతగ్గులను ఆధారంగా.. ప్రస్తుతం రోజువారీగా చమురు సంస్థలు పెట్రోల్, డీజిల్ ధరలను నిర్ణయిస్తున్నాయి.
ఇవీ చూడండి:కరోనా రూల్స్‌పై కేంద్రం కీలక ప్రకటన