తెలంగాణ

telangana

ETV Bharat / city

సుప్రీంలో 'దిశ' నిందితుల కుటుంబాల పిటిషన్​ - petition filed in suprem court by disha accused family

సుప్రీంలో 'దిశ' నిందితుల కుటుంబాల పిటిషన్​
సుప్రీంలో 'దిశ' నిందితుల కుటుంబాల పిటిషన్​

By

Published : Dec 19, 2019, 4:20 PM IST

Updated : Dec 19, 2019, 11:28 PM IST

16:15 December 19

సుప్రీంలో 'దిశ' నిందితుల కుటుంబాల పిటిషన్​

     దిశ కేసులో ఎన్​కౌంటర్ చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలంటూ నిందితుల కుటుంబ సభ్యులు సర్వోన్నత న్యాయస్థానంను ఆశ్రయించారు. ఎన్​కౌంటర్​లో పాల్గొన్న పోలీసులపై ఎఫ్ఐఆర్(FIR) నమోదు చేయాలని నిందితుల కుటుంబాలు పిటిషన్​లో పేర్కొన్నాయి. నిందితులు జొల్లు నవీన్ తల్లి లక్ష్మీ, జొల్లు శివ తండ్రి రాజయ్య, చెన్నకేశవులు తండ్రి కుర్మన్న, అహ్మద్ తండ్రి పిన్జారి హూస్సేన్ పేర్లతో న్యాయవాది పీవీ కృష్ణమాచారి పిటిషన్ దాఖలు చేశారు. 
 

ఒక్కో కుటుంబానికి రూ.50 లక్షలు ఇవ్వాలి
      ఎన్​కౌంటర్​పై ఇప్పటికే సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన న్యాయ విచారణ కమిషన్ ఆధ్వర్యంలో సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని.. సాక్ష్యాలు తారుమూరు చేయకుండా సీపీ సజ్జనార్ సహా తెలంగాణ ప్రభుత్వాన్ని నియంత్రించాలని పిటిషన్​లో కోరారు. ఎన్​కౌంటర్ నిందితులకు ఒక్కో కుటుంబానికి 50 లక్షల రూపాయల చొప్పున పరిహారం అందించేలా ఆదేశించాలని కోరారు. 
 

ఇవీ చూడండి: తూటా ఏ తుపాకిది? ఎవరు కాల్చారు? ఎవరికి తాకింది?

Last Updated : Dec 19, 2019, 11:28 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details