తెలంగాణ

telangana

ETV Bharat / city

చెత్తతో ఇంట్లోనే ఎరువులు - చెత్తతో ఇంట్లోనే ఎరువులు

రోజు రోజుకి చెత్త చాలా విలువైనదిగా రూపాంతరం చెందుతోంది. ప్రభుత్వం ఓ వైపు విద్యుత్​ను రూపొందిస్తామంటుంటే... కొన్ని ప్రైవేటు సంస్థలు తడిచెత్తతో ఇంట్లోనే ఎరువులు తయారు చేయోచ్చంటున్నాయి.

చెత్తతో చెట్లకు మంచిదే

By

Published : Mar 5, 2019, 9:00 PM IST

చెత్తతో చెట్లకు మంచిదే
తడిచెత్త నుంచి ఎరువును తయారు చేసే పరికరాలను శేరిలింగంపల్లి పశ్చిమ జోనల్ జీహెచ్​ఎంసీ కార్యాలయంలో అమ్ముతున్నారు. వీటితో ఇంట్లోనే సులభంగాఎరువులు తయారుచేసుకోవచ్చని నిర్వాహకులు అంటున్నారు.

ముప్పై రోజుల్లో...

ఇంట్లో వెలువడే తడిచెత్తను బిన్ లలో వేసి కంపోజర్ మందు చల్లి నెలరోజులు ఉంచాలి. అప్పడు చెత్త ఎరువుగా మారుతుంది. అందులోంచి వచ్చే ద్రవపదార్థం పిచికారీ చేస్తే సత్ఫలితాలు ఉంటాయంటున్నారు నిర్వాహకులు.

ముగ్గురు సభ్యులుంటే చాలు...

కుటుంబంలో ముగ్గురు సభ్యులుంటే చాలు.. తడి చెత్తను ఎరువుగా మార్చుకోవచ్చని అంటున్నారు. పరికరాలకు రెండు వేల రూపాయలు ఖర్చవుతుందని తెలిపారు. ఈ విధంగా అందరూ చేయగలిగితే చేటు చేసే చెత్తను రూపుమాపి నగరాన్ని శుభ్రంగా చేసుకోవచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇవీ చూడండి:అతివల అందాలు అదరహో

ABOUT THE AUTHOR

...view details