తెలంగాణ

telangana

ETV Bharat / city

AOB: ఎస్పీ రిషికేష్ కిల్లారి బదిలీ రద్దు కోరుతూ గిరిజనుల ర్యాలీ - vishaka news

ఆంధ్ర - ఒడిశా సరిహద్దులోని తమ గ్రామాల అభివృద్ధికి ఎంతగానో కృషి చేసిన మల్కాన్‌గిరి ఎస్పీ రిషికేష్ కిల్లారిని బదిలీ చేయవద్దంటూ ఆ ప్రాంత గిరిజను ర్యాలీ నిర్వహించారు. మావోల ప్రాబల్యాన్ని తగ్గించి మౌలిక వసతులు కల్పించిన ఆయన... మరికొంత కాలం తమ ప్రాంతంలోనే ఉండాలని వారు కోరుతున్నారు.

people-in-aob-rallied-to-cancel-sp-rishikesh-killari-transfer-from-their-area
people-in-aob-rallied-to-cancel-sp-rishikesh-killari-transfer-from-their-area

By

Published : Jul 11, 2021, 5:40 PM IST

గత ఐదు దశాబ్దాల పైబడి అభివృద్ధికి దూరంగా ఉన్న తమ గ్రామాలను... అభివృద్ధి పథంలో నడిపించిన ఎస్పీని బదిలీ చేయవద్దంటూ ఆంధ్ర- ఒడిశా సరిహద్దులోని గ్రామాలకు చెందిన గిరిజనులు ర్యాలీ చేయడం ప్రాముఖ్యత సంతరించుకుంది. ఆంధ్ర - ఒడిశా సరిహద్దులోని మల్కన్​​గిరి (Malkangiri) స్వాభిమన్ ఏరియాలోని జోడంభో తదితర గ్రామాలు... బలిమెల జలాశయం కారణంగా... ముంపు గ్రామలుగా మిగిలిపోయాయి. తరువాత ఈ ప్రాంతం మావోయిస్టులకు కంచుకోటలా మారింది.

మల్కన్‌గిరి ఎస్పీగా రిషికేష్ కిల్లారి ఆ ప్రాంతానికి వచ్చిన తరువాత మావోల దూకుడుకు కళ్లెం వేసి, భారీ స్థాయిలో అభివృద్ధి పనులు చేపట్టారు. తాజాగా... ఆయన మయూర్బంజ్​కి బదిలీ అయ్యారు. ఎస్పీ ఉన్నపుడు తమ గ్రామాలకు పోలీస్​ స్టేషన్, సెల్​టవర్​, రహదారులు తదితర మౌలిక సదుపాయాలు వచ్చాయని.. వాటి వల్ల తమ జీవనం అభివృద్ధి చెందిందని గిరిజనులు చెప్పారు.

మరి కొన్ని రోజుల పాటైనా ఆయన్ను తమ ప్రాంతంలోనే కొనసాగించాలని.. గిరిజనులు ర్యాలీ నిర్వహించారు. మావోయిస్టుల ప్రాబల్యం తగ్గుముఖం పట్టేందుకు పోలీసులు తీసుకున్న చర్యలను అభినందిస్తున్న అక్కడి గిరిజనులు ఎస్పీ రిషికేష్ కిల్లారి బదిలీని నిలిపివేయాలని కోరుతున్నారు.

ఇదీ చదవండి:గోల్కొండ తల్లికి తొలి బోనం.. భాగ్యనగరమంతా కోలాహలం

ABOUT THE AUTHOR

...view details