ఏపీలోని విశాఖ జిల్లా చీడికాడ మండలం చుక్కపల్లిలో భారీ కొండచిలువ అలజడి సృష్టించింది. సరుగుడు తోటలో పని చేస్తున్న రైతులపై దాడి చేసేందుకు యత్నించగా... వారు భయభ్రాంతులకు గురయ్యారు. సమీపంలోని కొందరు రైతులు కొండచిలువను హతమార్చారు. సుమారు 10 అడుగులకు పైగా ఉన్న భారీ కొండచిలువను చూసేందుకు సమీప ప్రజలు పెద్ద ఎత్తున వచ్చారు.
చుక్కపల్లిలో.. చుక్కలు చూపించిన కొండచిలువ - విశాఖ జిల్లా చుక్కపల్లిలో కొండచిలువ వార్తలు
ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ జిల్లా చీడికాడ మండలం చుక్కపల్లిలో భారీ కొండచిలువ స్థానికులను భయభ్రాంతులకు గురిచేసింది. సమీపంలోని కొందరు రైతులపై దాడికి యత్నించగా.. వారు దానిని హతమార్చారు. ఈ కొండచిలువ సుమారు 10 అడుగులకు పైగా ఉన్నట్లు స్థానికులు తెలిపారు.
చుక్కపల్లిలో.. చుక్కలు చూపించిన కొండచిలువ