అధికారులకు మానవత్వం లేకుండాపోతుంది.. బాధితుల కష్టాలు పట్టించుకునే దాఖలాలే కనిపించడం లేదు. జానెడు పొట్ట కోసం.. ప్రభుత్వం ఇచ్చే పింఛన్ కోసం ఎదురుచూస్తున్న అభాగ్యులకు.. వారు చేపడుతున్న చర్యలతో ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో పడ్డారు. ఇలాంటి ఘటనలు నిత్యం ఏదో ఒక చోట వెలుగుచూస్తూనే ఉన్నాయి. ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం మండలం లంకలగన్నవరం గ్రామానికి చెందిన ఎర్రంశెట్టి వీరాస్వామి అనే 85 ఏళ్ల వృద్ధుడు దివ్యాంగుడు. అతని రెండు చేతులకు వేళ్లు లేవు. కంటిచూపు కూడా సరిగ్గా కనపడదు. ఇది చాలదన్నట్లు చెవులు కూడా వినపడవు. అలాంటి వృద్ధుడికి 'ఈ కేవైసీ' అవ్వకపోవటంతో... పింఛన్ నిలిపేశారు.
PENSION PROBLEMS: వేళ్లే లేవు సారు... వేలిముద్ర ఎలా వేయాలి... నాకు ఇక... - ఈ-కేవైసీ అవ్వకపోవటంతో పింఛన్ నిలిపివేత
అతని రెండు చేతులకు వేళ్లు లేవు. వృద్ధాప్యం కారణంగా కనుచూపు స్పష్టంగా లేదు. చెవులూ వినపడవు. అలాంటి వృద్ధుడికి 'ఈ కేవైసీ' అవ్వకపోవటంతో... పింఛన్ నిలిపేశారు. ప్రభుత్వ నిబంధనలతో అధికారులకు మానవత్వం లేకుండాపోతుందని వృద్ధుడి భార్య ఆవేదన వ్యక్తం చేస్తుంది.
గతంలో అతనికి దివ్యాంగుల పింఛన్ వచ్చేది. చేతులకు వేళ్లు లేకపోవడంతో.. వేలిముద్రలు వేయలేని కారణంగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి పింఛను అందించారు. 'ఈ కేవైసీ' కాకపోవటంతో ఐదు నెలలుగా పెన్షన్ రావటం లేదని వీరాస్వామి భార్య రామరత్నం ఆవేదన వ్యక్తం చేశారు. రెండు సంవత్సరాలుగా రేషన్ బియ్యం కూడా ఇవ్వటం లేదన్నారు. తన భర్తకు రేషన్, పెన్షన్ అందేలా చేయాలని అధికారులను కోరుతున్నారు.
ఇదీ చూడండి:Revanth Reddy: 'మనం కొట్టుకోవడం కాదు.. తెరాస, భాజపాలపై మన ప్రతాపాన్ని చూపిద్దాం'