తెలంగాణ

telangana

ETV Bharat / city

కేసీఆర్ ఎప్పుడైనా అంబేడ్కర్​​ విగ్రహానికి పూలమాల వేశారా?: గీతారెడ్డి - దళిత బంధు వార్తలు

సీఎం కేసీఆర్​ రాజ్యాంగ నిర్మాత డా.బీఆర్​ ఆంబేడ్కర్​ విగ్రహానికి పూమ మాల వేశారా అంటూ టీపీసీసీ వర్కింగ్​ ప్రెసిడెంట్​ గీతారెడ్డి ప్రశ్నించారు. ఎస్సీ ఉపప్రణాళిక నిధులను సరిగా ఖర్చు చేయలేదన్నారు. ఇప్పుడు కొత్తగా దళితబంధు అంటూ ప్రభుత్వం మభ్యపెడుతోందని హైదరాబాద్​లోని గాంధీభవన్​లో విమర్శించారు.

geethareddy
గీతారెడ్డి

By

Published : Jul 31, 2021, 1:02 PM IST

Updated : Jul 31, 2021, 1:21 PM IST

దళితబంధు అంటూ ఎస్సీలను ప్రభుత్వం మభ్యపెడుతోందని టీపీసీసీ వర్కింగ్​ ప్రెసిడెంట్​ గీతారెడ్డి విమర్శించారు. ఎస్సీ ఉపప్రణాళిక నిధులను సరిగా ఖర్చు చేయలేదని చెప్పారు. గత ఏడేళ్లలో ఎస్సీ ఉపప్రణాళికకు రూ.85,913 కోట్లు కేటాయించారని.. రూ.47,685 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని వివరించారు. మిగిలిన నిధులు ఏమయ్యాయో ప్రభుత్వం స్పష్టం చేయాలని డిమాండ్​ చేశారు. ఎస్సీలకు కేటాయించిన నిధులనే వారికి ఎందుకు ఖర్చు చేయట్లేదని ప్రశ్నించారు.

గత ఐదేళ్లలో ఎస్సీ రుణాల రాయితీ కోసం 5,33,812 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. ఎస్సీలకు ఇప్పటికే ఉన్న రాయితీలను కూడా సక్రమంగా అందించట్లేదని చెప్పారు. ఎస్సీలకు ఇవ్వాల్సిన బకాయిలను ఇప్పటివరకు చెల్లించలేదన్నారు. బ్యాక్‌లాగ్ పోస్టులను కూడా ఎందుకు భర్తీ చేయట్లేదని నిలదీశారు. ఎస్సీలకు మూడెకరాల చొప్పున ఇస్తామని చెప్పారని.. భూములు లేని ఎస్సీలు దాదాపు 3 లక్షలమంది ఉన్నారని గీతారెడ్డి గుర్తు చేశారు. గత ఏడేళ్లలో ఎస్సీలకు మూడెకరాల భూమి హామీ ఊసే లేదని విమర్శించారు.

దళిత బంధు అని పేరు పెట్టి ఎస్సీలను దగా చేస్తున్నారు. ఇది దళిత బంధా.. దళిత దగానా. 2014 ఎన్నికల ముందు ఎస్సీని ముఖ్యమంత్రిని చేస్తా లేకుంటే.. తలకాయ నరుకుంటా అని కేసీఆర్​ చెప్పారు. కాని ఎస్సీని సీఎం చేయలేదు. రాజయ్యను డిప్యూటీ చేసి మధ్యలోనే తొలగించారు. ఎందుకు తొలగించారో కూడా చెప్పలేదు. ఎస్సీ, ఎస్టీ సబ్​ప్లాన్​ మేం చట్టంగా తీసుకొచ్చాం. జనవరి 24, 2013లో కాంగ్రెస్​ ప్రభుత్వం ఈ చట్టం తీసుకొచ్చింది. దీని కోసం మేం ఎంతో పోరాడం. రాజ్యాగం నిర్మాత డా.బీఆర్​ అంబేడ్కర్​ జయంతి రోజు కాని వర్ధంతి రోజు కాని దళిత బంధు సీఎం కేసీఆర్​ పూమ మాల వేశారా..?

-గీతారెడ్డి, టీపీసీసీ వర్కింగ్​ ప్రెసిడెంట్​

కేసీఆర్ ఎప్పుడైనా అంబేడ్కర్​​ విగ్రహానికి పూలమాల వేశారా?: గీతారెడ్డి

ఇదీ చదవండి:BANDI SANJAY: ఈటలకు బండి సంజయ్ పరామర్శ

'ఈ సమయంలో ఎమ్మెల్సీ ఎన్నికలు సబబు కాదు'

Last Updated : Jul 31, 2021, 1:21 PM IST

ABOUT THE AUTHOR

...view details