చమురు సంస్థలు వరుసగా 18వ రోజు కూడా పెట్రోల్, డీజిల్ ధరలు పెంచాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ధరలు పెరుగుతుండానికి వ్యతిరేకంగా... పీసీసీ ఎస్సీ సెల్ ఇవాళ హైదరాబాద్‌లో నిరసన ర్యాలీ నిర్వహించింది. గాంధీ భవన్ నుంచి ట్యాంక్‌బండ్ అంబేడ్కర్ విగ్రహం వరకు ర్యాలీగా వెళ్లేందుకు ప్రయత్నించగా... పోలీసులు అడ్డుకున్నారు. ఎస్సీ సెల్ అధ్యక్షుడు ప్రీతంను... నాంపల్లి సర్కిల్ వద్ద పోలీసులు అరెస్టు చేశారు. ఈ క్రమంలో పోలీసులకు, పార్టీ శ్రేణులకు మధ్య తోపులాట జరిగింది.
పీసీసీ ఎస్సీ సెల్ నిరసన ర్యాలీ.. నేతల అరెస్టు - పీసీసీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు ప్రీతం అరెస్టు
చమురు ధరల పెంపును నిరసిస్తు పీసీసీ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. నేతలను నాంపల్లి సర్కిల్ వద్ద అరెస్టు చేసి పోలీసు స్టేషన్‌కు తరలించారు.
పీసీసీ ఎస్సీ సెల్ నిరసన ర్యాలీ.. నేతల అరెస్టు