ప్రాజెక్టులతో అద్భుతాలు సృష్టించామని సీఎం కేసీఆర్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. ప్రాజెక్టులపై ప్రభుత్వం చేస్తున్న ప్రచారంలో నిజనిజాలు ఏంటో ప్రజలకు తెలిపేందుకే జలదీక్ష చేపట్టినట్లు స్పష్టం చేశారు. గోదావరి, కృష్ణా నదులపై నిర్మించామంటున్న ప్రాజెక్టులపై ప్రజలకు వాస్తవాలు తెలియాలన్నారు.
పోరాడి సాధించిన తెలంగాణలో ప్రజలకు మంచి జరుగుతుందని ఆశించాం. కేసీఆర్ పాలనలో అన్నీ రాజ్యాంగబద్ధ వ్యవస్థలను బలహీనం చేశారు. తెలంగాణలో ఇలాంటి పరిస్థితి ఉంటుందని ఊహించలేదు. ప్రధాన ప్రతిపక్షాన్ని కూడా అణచివేసే చర్యలు ఎప్పుడూ జరగలేదు. కొంతమంది పోలీస్ అధికారులు ఐపీఎస్ మాదిరిగా కాకుండా కేపీఎస్‌లుగా పనిచేస్తున్నారు.