మున్సిపాల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపిస్తే ప్రజలకు అందుబాటులో ఉంటూ అభివృద్ధి చేస్తామని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో కేసీఆర్‌కు షాక్ ఇస్తేనే అయనకు గుణపాఠం కలుగుతుందని చెప్పారు. ఫేస్బుక్ లైవ్‌లో ఆయన మాట్లాడారు.
తెరాసను ఓడించి బుద్ధి చెప్పండి: ఉత్తమ్
రైతుబంధు, రైతు రుణమాఫీ చేయని తెరాస ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలని పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. నిరుద్యోగ భృతిని కేసీఆర్ పట్టించుకోనందున... మున్సిపల్ ఎన్నికల్లో నిరుద్యోగులు తెరాసను చిత్తుగా ఓడించాలని సూచించారు.
uttam kumar reddy
తెరాస, భాజపా మ్యాచ్ ఫిక్సింగ్ రాజకీయాలను మైనార్టీ ప్రజలు గ్రహించాలని కోరారు. గులాబీ పార్టీకి మైనార్టీలు ఎవరూ ఓటు వేయవద్దని చెప్పారు. కేరళ లాగా సీఏఏ బిల్లుకు వ్యతిరేకంగా అసెంబ్లీలో సీఎం కేసీఆర్ తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి: రామగుండానికి అభివృద్ధి బాటలు పడేదెన్నడో...?