రాష్ట్రంలో ఇటీవల దాడులకు గురైన దళిత కుటుంబాల తరఫున న్యాయపోరాటం చేస్తామని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ స్పష్టం చేశారు. పది బాధిత దళిత కుటుంబాలతో.. ఇందిరాభవన్‌లో ఉత్తమ్, ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్, మాజీ ఎంపీ మల్లు రవి సమావేశమయ్యారు. వారికి అండగా ఉంటామని కాంగ్రెస్ నేతలు హామీ ఇచ్చారు.
గజ్వేల్‌లోని భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం వల్లనే నర్సింహులు ఆత్మహత్యకు పాల్పడ్డారని ఉత్తమ్ ఆరోపించారు. ఆ జిల్లా కలెక్టర్ వెంకట్రామిరెడ్డితో మాట్లాడిని ఉత్తమ్.. నర్సింహులు కుటుంబానికి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి నియోజకవర్గంలోనే దళితుల భూమి లాక్కుంటారా....అని ప్రశ్నించారు పీసీసీ చీఫ్ ఉత్తమ్.