గ్రేటర్ పోరు ముగియడంతో రాష్ట్రంలో పార్టీలన్నీ ఇక రానున్న ఎన్నికలపై దృష్టి సారించనున్నాయి. అవన్నీ పార్టీలకు అత్యంత ప్రతిష్ఠాత్మకం కానున్నాయి. రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలతో పాటు వరంగల్, ఖమ్మం నగరపాలక సంస్థలకు ఎన్నికలు జరగనున్నాయి. అలాగే ఇటీవల నాగార్జునసాగర్ శాసనసభ్యుడు నోముల నర్సింహయ్య మరణించడంతో ఆ స్థానానికి కూడా ఆరునెలల్లో ఉప ఎన్నిక జరగాల్సి ఉంటుంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఓటర్ల నమోదు ప్రక్రియ ఇప్పటికే పూర్తయింది. మార్చి నెలలోపు గ్రేటర్ వరంగల్, ఖమ్మం కార్పొరేషన్‌లకు ఎన్నికలు జరగాల్సి ఉంది. రెండు పట్టభద్రుల నియోజకవర్గాల్లో హైదరాబాద్- రంగారెడ్డి-మహబూబ్‌నగర్ స్థానానికి భాజపా ప్రాతినిథ్యం వహిస్తుండగా, వరంగల్-నల్గొండ- ఖమ్మం పట్టభద్రుల స్థానానికి తెరాస ప్రాతినిథ్యం వహిస్తోంది. సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవడంతో పాటు మరో స్థానాన్ని కైవసం చేసుకోవడానికి తెరాస, భాజపాలు తీవ్రంగా పోటీ పడనున్నాయి.
వచ్చే ఎన్నికల పరిస్థితి ఏంటో!
జీహెచ్ఎంసీ పోరు ముగియడం వల్ల పార్టీలన్నీ రానున్న ఎన్నికలపై దృష్టి పెట్టనున్నాయి. రాష్ట్రంలో రెండు ఎమ్మెల్సీ స్థానాలతో పాటు వరంగల్, ఖమ్మం నగరపాలక సంస్థలకు ఎన్నికలు జరగనున్నాయి. నాగార్జునసాగర్ ఎమ్మెల్యే మరణించడం వల్ల ఆ స్థానానికి ఆరు నెలల్లో ఉపఎన్నిక జరగాల్సి ఉంది. ఇక పార్టీల దృష్టి అంతా రానున్న ఎన్నికలపైనే ఉండనుంది.
దుబ్బాక గెలుపుతో పాటు గ్రేటర్‌లో 49 డివిజన్లను దక్కించుకున్న భాజపా ఎమ్మెల్సీ ఎన్నికలపై ప్రత్యేక దృష్టి సారించనుంది. అధికార తెరాస కూడా రెండు ఎమ్మెల్సీ స్థానాలను కైవసం చేసుకోవడానికి ఓటర్ల నమోదు ప్రక్రియలో అత్యంత క్రియాశీలకంగా వ్యవహరించింది. వరంగల్, ఖమ్మం రెండు కార్పొరేషన్లను గత ఎన్నికల్లో సొంతం చేసుకున్న తెరాస ఈసారి కూడా ఆ ఆధిపత్యాన్ని కొనసాగించేందుకు ప్రత్యేక దృష్టి సారించనుంది. దుబ్బాక, గ్రేటర్ ఫలితాల నేపథ్యంలో తెరాస అప్రమత్తంగా వ్యవహరించనుంది. నోముల నర్సింహయ్య మృతితో జరగనున్న నాగార్జునసాగర్‌లో గతంలో కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి ప్రాతినిధ్యం వహించారు. ఈ క్రమంలో అక్కడ జరగనున్న ఉప ఎన్నిక తెరాస, కాంగ్రెస్‌లకు అత్యంత కీలకం కానుంది.
ఇవీ చూడండి: వారసులు అందరికీ నచ్చలేదు... కొందరిని మాత్రమే వరించిన విజయం