Etv Bharat Effect : ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో పార్ట్ టైమ్ ఇన్‌స్ట్రక్టర్ల నియామకానికి విద్యాశాఖ అనుమతి ఇచ్చింది. వారిని విధుల్లోకి తీసుకోవాలని పాఠశాల విద్యాశాఖ సంచాలకురాలు శ్రీదేవసేన బుధవారం అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పార్ట్ టైమ్ గురువుల నియామకాలేవి? అనే శీర్షికన ఈ నెల 19న ‘ఈనాడు’లో కథనం ప్రచురితమైన సంగతి తెలిసిందే. దీనికి స్పందించిన ఆమె ఆదేశాలు జారీ చేశారు. మరో వైపు సమగ్ర శిక్షా అభియాన్‌లో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ సిబ్బంది 27,618 మంది పునఃనియామకానికి ఆర్థికశాఖ అనుమతి జారీ చేసింది.
Etv Bharat Effect: పార్ట్ టైమ్ గురువుల నియామకానికి అనుమతి - తెలంగాణ పాఠశాలల్లో పార్ట్‌టైం ఇన్‌స్ట్రక్టర్లు
Etv Bharat Effect : సర్కార్ ఉన్నత పాఠశాలల్లో పార్ట్‌టైమ్ ఇన్‌స్ట్రక్టర్ల నియామకానికి విద్యాశాఖ పచ్చజెండా ఊపింది. పార్ట్ టైమ్ గురుకుల నియామకాలపై ఈనాడు-ఈటీవీ భారత్ రాసిన కథనానికి పాఠశాల విద్యాశాఖ సంచాలకురాలు శ్రీ దేవసేన స్పందించారు. ఈ మేరకు పార్ట్‌టైమ్ ఇన్‌స్ట్రక్టర్లను విధుల్లోకి తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.
part time instructors recruitment
114 ల్యాబ్ అటెండర్ ఉద్యోగాల క్రమబద్ధీకరణ..రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మినిమం టైమ్ స్కేల్ విధానంలో ల్యాబ్ అటెండర్లుగా ఒకేషనల్ విభాగంలో పనిచేస్తున్న 114 మంది ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తూ ప్రభుత్వం బుధవారం జీఓ జారీ చేసింది.
విదేశీవిద్యకు రూ.60 కోట్లు..మహాత్మా జ్యోతిరావ్ ఫులే విదేశీవిద్యా పథకానికి ప్రభుత్వం రూ.60కోట్లు విడుదల చేసింది. ఈ మేరకు బీసీ సంక్షేమశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం ఉత్తర్వులు జారీచేశారు.