ఏపీలోని తూర్పు గోదావరి జిల్లా కొమరిపాలెం మార్కెట్లో విక్రయానికి వచ్చిన ఓ భారీ చేప అందరినీ ఆకట్టుకుంది. సుమారు 300 కిలోల బరువున్న ఆ చేపను 'పండుగప్ప' చేప అంటారు. చేపల వ్యాపారులు పంతాడ విశ్వనాథం, రాజు, విజయ్.. ఈ చేపను విక్రయించేందుకు కొమరిపాలెంలోని చేపల మార్కెట్కు తీసుకొచ్చారు.
300 kgs Big Fish: ఈ చేప.. ఎంత పే......ద్దగా ఉందో! - పండుగప్ప చేప
ఏపీలోని తూర్పు గోదావరి జిల్లా కొమరిపాలెం మార్కెట్లో 300 కిలోల బరువైన 'పండుగప్ప' చేప అందరినీ ఆకట్టుకుంటోంది. బరువైన ఈ చేపను చూసేందుకు స్థానికులు అంతా ఎగబడ్డారు.
big found at east godavari
భారీ చేప అమ్మకానికి వచ్చిందన్న విషయం అంతా తెలిసి.. దాన్ని చూసేందుకు భారీగా ఎగబడ్డారు. ఇలాంటి చేపలు చిక్కడం చాలా అరుదని మత్స్యకారులు చెప్పారు. సుమారు 30 వేల రూపాయలకు ఈ చేపను విక్రయించినట్లు వ్యాపారులు తెలిపారు.
ఇదీచూడండి:Drunkards attack: మద్యం మత్తులో యువకుల వీరంగం.. రాళ్లతో పరస్పర దాడి