తెలంగాణ

telangana

ETV Bharat / city

ఏపీ పల్లె తీర్పు: వెలువడుతున్న తుది విడత పంచాయతీ ఎన్నికల ఫలితాలు - panchayat elections last phase counting news

పల్లె పోరు: తుది విడత పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపు
పల్లె పోరు: తుది విడత పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపు

By

Published : Feb 21, 2021, 4:09 PM IST

Updated : Feb 21, 2021, 9:43 PM IST

21:42 February 21

ప్రత్యర్థి డిమాండ్‌ మేరకు మూడోసారి ఓట్ల లెక్కింపు

  • నెల్లూరు: ముత్కూరు మండలం పైనంపురంలో గందరగోళం
  • ఒక ఓటుతో విజయకుమార్‌ అనే అభ్యర్థి గెలిచినట్లు ప్రకటన
  • రీ కౌంటింగ్‌ చేయాలని డిమాండ్‌ చేసిన ప్రత్యర్థులు
  • రెండోసారి కౌంటింగ్‌లో 2 ఓట్లతో విజయ్‌ కుమార్‌ గెలిచినట్లు ప్రకటన
  • ప్రత్యర్థి డిమాండ్‌ మేరకు మూడోసారి లెక్కిస్తున్న అధికారులు 

21:36 February 21

పాకాల గ్రామ సర్పంచి ఫలితంపై ఉత్కంఠ

  • చిత్తూరు: పాకాల గ్రామ సర్పంచి ఫలితంపై ఉత్కంఠ
  • సురేశ్‌పై ఒక ఓటు తేడాతో సుబ్రహ్మణ్యం విజయం
  • రీ కౌంటింగ్ చేయాలని సురేశ్‌ డిమాండ్‌

21:31 February 21

వేలిముద్రలు ఉన్న 36 ఓట్లను చెల్లనివిగా పక్కకు పెట్టిన అధికారులు

  • విశాఖ: ఆనందపురం మండలం గండిగుండంలో గందరగోళం
  • వేలిముద్రలు ఉన్న 36 ఓట్లను చెల్లనివిగా పక్కకు పెట్టిన అధికారులు
  • గండిగుండం సర్పంచిగా 21 ఓట్లతో శ్రీను అనే అభ్యర్థి విజయం
  • తనకు వచ్చిన 36 ఓట్లు పక్కకు పెట్టారని శ్రీను ప్రత్యర్థి ఆరోపణ

21:31 February 21

పెదనందిపాడు మండలం పుసులూరులో ఉద్రిక్తత

  • గుంటూరు: పెదనందిపాడు మండలం పుసులూరులో ఉద్రిక్తత
  • 9 ఓట్ల తేడాతో పెద్ది రాధిక గెలిచినట్లు అధికారుల ప్రకటన
  • రీ కౌంటింగ్ చేయాలని ప్రత్యర్థి విజయలక్ష్మి మద్దతుదారుల డిమాండ్‌
  • గ్రామానికి భారీగా చేరుకున్న పోలీసులు, రీ కౌంటింగ్ విషయంపై చర్చలు

21:14 February 21

కౌంటింగ్‌ అధికారులతో సర్పంచ్‌ అభ్యర్థి వాగ్వాదం

  • చిత్తూరు: సత్యవేడు మండలం మదనంబేడులో ఉద్రిక్తత
  • కౌంటింగ్‌ అధికారులతో సర్పంచ్‌ అభ్యర్థి వాగ్వాదం
  • కౌంటింగ్ పూర్తికాకుండానే అభ్యర్థి గెలిచినట్లు ప్రకటించారని ప్రత్యర్థి ఆరోపణ
  • రీ కౌంటింగ్ కోసం ఓడిన అభ్యర్థి డిమాండ్, పోలింగ్ కేంద్రంలో ఆందోళన

21:09 February 21

ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు నచ్చాయి: సజ్జల

  • వైకాపా మద్దతుదారుల వివరాలు మేం వెబ్‌సైట్‌లో ఉంచుతాం: సజ్జల
  • ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లోనూ ఇదే హవా కొనసాగుతుంది: సజ్జల
  • ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు నచ్చాయి: సజ్జల

21:00 February 21

మల్లుగూరులో సమాన ఓట్లు... టాస్ వేసిన అధికారులు

  • అనంతపురం: హిందూపురం మం. మల్లుగూరులో సమాన ఓట్లు
  • ఇద్దరు అభ్యర్థులకు 570 ఓట్లు, టాస్ వేసిన అధికారులు
  • టాస్‌లో సర్పంచి అభ్యర్థి రమేశ్‌ను వరించిన అదృష్టం

20:18 February 21

పలు జిల్లాల్లో గెలుపొందిన అభ్యర్థులు

  •  
  • తూ.గో.: ఠాణేలంక సర్పంచిగా 10 ఓట్లతో కొప్పిశెట్టి కృష్ణమూర్తి గెలుపు
  • తూ.గో.: గాడిలంక సర్పంచిగా 10 ఓట్లతో పెద్దిరెడ్డి మునీంద్రరావు విజయం
  • గుంటూరు: అందుకూరు సర్పంచిగా 10 ఓట్లతో సౌభాగ్యలక్ష్మి గెలుపు
  • కర్నూలు: హనుమాపురం సర్పంచిగా 10 ఓట్లతో ఇందిరమ్మ విజయం
  • ప్రకాశం: చిన్నదోర్నాల సర్పంచిగా 9 ఓట్లతో పోలమ్మ గెలుపు
  • గుంటూరు: గోరంట్ల సర్పంచిగా 3 ఓట్లతో మద్దిగుంట్ల వెంకయ్య విజయం
  • ప.గో.: ఉంగుటూరు మం. నీలాద్రిపురం సర్పంచిగా 3 ఓట్లతో విజయం
  • ప్రకాశం జిల్లా అక్కపల్లెలో సర్పంచిగా 7ఓట్లతో సోమిరెడ్డి గెలుపు

20:16 February 21

ఓట్ల లెక్కింపు వేళ ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి: చంద్రబాబు

  • పథకాలు, కేసులు, దాడుల పేరుతో ఓటర్లను బెదిరించారు: చంద్రబాబు
  • ఈసారి కూడా అర్ధరాత్రి ప్రజా తీర్పు తారుమారు చేసే అవకాశం: చంద్రబాబు
  • ఓట్ల లెక్కింపు వేళ ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి: చంద్రబాబు
  • ఆఖరి ఓటు లెక్కించే వరకు కౌంటింగ్ కేంద్రం వద్దే ఉండాలి: చంద్రబాబు

19:36 February 21

ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి: గిరిజా శంకర్‌

  • పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి: గిరిజా శంకర్‌
  • కలెక్టర్లు, జేసీలు, జడ్పీ సీఈవోలు సమర్థంగా పనిచేశారు: గిరిజా శంకర్‌
  • నాలుగోదశ ఎన్నికల్లో 82.85 శాతం పోలింగ్ నమోదు: గిరిజా శంకర్‌
  • అత్యధికంగా విజయనగరం జిల్లాలో 87.09 శాతం పోలింగ్: గిరిజా శంకర్‌
  • పంచాయతీ ఎన్నికల్లో 4 దశలు కలిపి 81.78 శాతం పోలింగ్: గిరిజా శంకర్‌
  • మొత్తం 4 దశల్లో 2,197 పంచాయతీలు ఏకగ్రీవం: గిరిజా శంకర్‌
  • మొత్తం 4 దశల్లో 47,459 వార్డులు ఏకగ్రీవం: గిరిజా శంకర్‌
  • నాలుగు దఫాల్లో కలిపి 10 890 పంచాయతీలు, 82894 వార్డులకు ఎన్నికలు జరిగాయి: గిరిజా శంకర్‌
  • 2.26కోట్ల మంది ఒటర్లు ఒటుహక్కు వినియోగించుకున్నారు: గిరిజా శంకర్‌
  • ఎలాంటి ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు: గిరిజా శంకర్‌
  • 10 పంచాయతీలు, 670 వార్డుల్లో నామినేషన్లు దాఖలు కాలేదు: గిరిజా శంకర్‌
  • వీటిలో ఎన్నికలకు కోసం ఎస్ఈసీ కి నివేదించి తగు చర్యలు తీసుకుంటాం: గిరిజా శంకర్‌
     

18:14 February 21

పలు జిల్లాల్లో గెలుపొందిన అభ్యర్థులు

  • గుంటూరు: క్రోసూరు మం. గరికపాడు సర్పంచిగా జి.అంకమ్మ గెలుపు
  • గుంటూరు: తిమ్మాపురం సర్పంచిగా 270 ఓట్లతో కల్లూరి శ్రీనివాసరావు విజయం
  • పెదకాకాని మం. రామచంద్రపాలెం సర్పంచిగా చిగురుపాటి పద్మజారాణి విజయం
  • విజయనగరం: మెంటాడ మం. కూనేరు సర్పంచిగా శ్రీరాములు గెలుపు
  • విజయనగరం: జామి మండలం పవాడ సర్పంచిగా 60 ఓట్లతో జ్యోతి గెలుపు
  • కర్నూలు: చిప్పగిరి మం. దౌల్తాపురం సర్పంచిగా లక్ష్మీదేవి విజయం
  • ప్రకాశం: గిద్దలూరు మం. ఆదిమూర్తిపల్లె సర్పంచిగా పర్వత వెంకటసుబ్బమ్మ గెలుపు
  • తూ.గో: రావులపాలెం మం. ముమ్మిడివరప్పాడు సర్పంచ్‌గా వర్రే రేణుక విజయం
  • గుంటూరు: తోకవారిపాలెం సర్పంచిగా 6 ఓట్లతో దొడ్డా సామ్రాజ్యం గెలుపు

18:14 February 21

నాలుగో విడత పంచాయతీ ఎన్నికల్లో 82.85 శాతం పోలింగ్‌

  • నాలుగో విడత పంచాయతీ ఎన్నికల్లో 82.85 శాతం పోలింగ్‌
  • మొత్తం 4 విడతల పంచాయతీ ఎన్నికల్లో 80.14 శాతం పోలింగ్

17:27 February 21

గుంటూరు జిల్లాలోని పలు పంచాయతీల్లో గెలుపొందిన అభ్యర్ధులు

  • గుంటూరు: ప్రత్తిపాడు మం. తిమ్మాపురం సర్పంచిగా కల్లూరి శ్రీనివాసరావు విజయం
  • గుంటూరు: క్రోసూరు మం. గరికపాడు సర్పంచిగా జి.అంకమ్మ గెలుపు
  • పెదకాకాని మం. రామచంద్రపాలెం సర్పంచిగా చిగురుపాటి పద్మజారాణి విజయం

16:30 February 21

కూనేరు సర్పంచిగా శ్రీరాములు గెలుపు

విజయనగరం: మెంటాడ మం. కూనేరు సర్పంచిగా శ్రీరాములు గెలుపు

15:51 February 21

ఏపీ పల్లె తీర్పు: వెలువడుతున్న తుది విడత పంచాయతీ ఎన్నికల ఫలితాలు

  • ఏపీలో చివరి విడత పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం
  • తొలుత రానున్న చిన్న గ్రామాల ఫలితాలు
  • ఆలస్యం కానున్న పెద్ద పంచాయతీల ఫలితాలు
  • ఏపీవ్యాప్తంగా మధ్యాహ్నం 2.30 వరకు 78.9 శాతం పోలింగ్
     
Last Updated : Feb 21, 2021, 9:43 PM IST

ABOUT THE AUTHOR

...view details