నూతన సచివాలయ భవన సముదాయ నిర్మాణం కోసం రెండు సంస్థలు మాత్రమే ముందుకొచ్చాయి. షాపూర్జీ పల్లోంజీ, ఎల్ అండ్ టీ కంపెనీలు టెండర్ బిడ్లు దాఖలు చేశాయి.
కొత్త సచివాలయ భవన సముదాయ నిర్మాణం కోసం రహదారులు, భవనాల శాఖ ఆన్లైన్ టెండర్లను ఆహ్వానించింది. టెండర్ దాఖలుకు నిన్నటితో గడువు ముగిసింది. ప్రీ బిడ్ మీటింగ్‌కు ఆరు కంపెనీల ప్రతినిధులు హాజరైనప్పటికీ... రెండు సంస్థలు మాత్రమే బిడ్లు దాఖలుచేశాయి.
కేవలం 12 నెలల్లోనే పూర్తి చేయడం, సబ్ కాంట్రాక్టర్లకు ఆస్కారం లేకపోవడం, మొబిలైజేషన్ అడ్వాన్స్‌లు లేకపోవడం వల్ల మిగతా సంస్థలు ఆసక్తి చూపలేదని సమాచారం. ప్రీ బిడ్ సమావేశం సందర్భంగా కొన్ని కంపెనీల ప్రతినిధులు ఈ అంశాలను ప్రస్తావించారు. టెండర్ దాఖలు గడువు ముగియడంతో సాంకేతిక బిడ్లను తెరిచారు. ఈ నెల 23న ఆర్థిక బిడ్లను పరిశీలించి, గుత్తేదారును ఎంపిక చేస్తారు.
ఇవీచూడండి:సచివాలయ నిర్మాణ వ్యవధి పెంచండి: గుత్తేదార్లు