కేబినెట్ భేటీ షురూ... ఆర్టీసీపై కీలక చర్చ! - tsrtc strike update
10:50 November 28
కేబినెట్ భేటీ షురూ... ఆర్టీసీపై కీలక చర్చ!
ఆర్టీసీ సమస్యే ప్రధాన అజెండాగా.. తెలంగాణ మంత్రివర్గం భేటీ అయింది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో ఆర్టీసీ సమస్యకు ముగింపు ఇచ్చే దిశగా చర్చ జరగనున్నట్లు సమాచారం.
52 రోజులపాటు 48 వేల మంది సిబ్బంది సమ్మె చేశారు. అనంతరం విధుల్లోకి చేరేందుకు వస్తున్నా వారిని ప్రభుత్వం అనుమతించడం లేదు. దీంతో ఆర్టీసీ కార్మికుల భవిష్యత్తు ఏంటి?సీఎం కేసీఆర్ దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు?అనే అంశాలపై ఆసక్తి నెలకొంది. రెండు రోజులపాటు జరగనున్న కేబినెట్ భేటీలో తొలిరోజు పూర్తిగా ఆర్టీసీ అంశంపైనే చర్చించనున్నట్లు సమాచారం.
మరోవైపు ఆర్టీసీలో కొత్తగా శాశ్వత నియామకాలను పూర్తిగా నిలిపివేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలిసింది. రాష్ట్రంలో 5,100 రూటు పర్మిట్లను ప్రైవేటుకు ఇవ్వాలని నిర్ణయించిన సర్కారు.. వాటిని పూర్తిగా గ్రామీణ మార్గాల్లోనే ఇవ్వనుందని సమాచారం. రూట్ల ఎంపిక ప్రక్రియ కూడా పూర్తయినట్లు తెలిసింది. మంత్రిమండలి సమావేశంలో వీటిని ప్రతిపాదించనున్నట్లు తెలుస్తోంది.