తెలంగాణ

telangana

ETV Bharat / city

ఒకే గ్రామం.. ఇద్దరు సర్పంచులు.. ఒకరేమో ఏకగ్రీవం!

సాధారణంగా ఒక గ్రామానికి ఒకే మండలం, ఒకే నియోజకవర్గం ఉంటుంది. కానీ ఏపీలోని అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం కొండపల్లి గ్రామానికి మాత్రం రెండు మండలాలు.. రెండు నియోజకవర్గాలు ఉన్నాయి. అలా ఎందుకు అనుకుంటున్నారా?

ఒకే గ్రామం.. ఇద్దరు సర్పంచులు.. ఒకరేమో ఏకగ్రీవం!
ఒకే గ్రామం.. ఇద్దరు సర్పంచులు.. ఒకరేమో ఏకగ్రీవం!

By

Published : Feb 13, 2021, 5:31 PM IST

ఆంధ్రప్రదేశ్​లోని అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం కొండపల్లి గ్రామంలో 150 నివాసాలు ఉన్నాయి. 1982 సంవత్సరంలో కొత్తగా మండలాలు ఏర్పడినప్పుడు కొండపల్లి గ్రామంలోని 80 నివాసాలు ఒక మండలానికి, 70 నివాసాలు మరో మండలంలోకి వెళ్లాయి. గ్రామంలోని చిన్న రహదారి గ్రామాన్ని రెండుగా విభజిస్తోంది.

ఒక వైపు పుట్లూరు మండలం సింగనమల నియోజకవర్గంలోకి, మరో వైపు తాడిపత్రి మండలం తాడిపత్రి నియోజకవర్గంలోకి వచ్చాయి. అప్పటి నుంచి ఒకే గ్రామానికి ఇద్దరు సర్పంచులు, ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు. తాజాగా జరిగిన సర్పంచ్​ ఎన్నికల్లో పుట్లూరు మండలానికి చెందిన సర్పంచ్ స్థానం ఏకగ్రీవమైంది. తాడిపత్రి మండలంలో ఉన్న కొండపల్లి గ్రామానికి మాత్రమే పోటీ జరుగుతోంది. వార్డు స్థానాలన్నీ కూడా ఏకగ్రీవం అయ్యాయి.

ఇదీ చదవండి:మంత్రి కొడాలి నానిపై కేసు నమోదుకు ఎస్‌ఈసీ ఆదేశం

ABOUT THE AUTHOR

...view details