అయేషా మీరా మృతదేహానికి మరోసారి శవపరీక్ష చేయనున్నట్లు గుంటూరు పోలీసులు తెలిపారు. తెనాలిలోని చెంచుపేట శ్మశానవాటికలో శవపరీక్ష నిర్వహించనున్నట్లు చెప్పారు. 2007 డిసెంబరు 27న ఇబ్రహీంపట్నం ప్రైవేట్ హాస్టల్లో అయేషా హత్య జరిగింది. ఈ కేసును సీబీఐకి అప్పగించారు. ఈ నేపథ్యంలో ఆధారాల కోసం మరోసారి శవపరీక్ష నిర్వహించనున్నారు.
'అయేషా మీరా హత్య కేసు.. మరోసారి శవపరీక్ష'
రేపు ఏపీలోని తెనాలి చెంచుపేట శ్మశానవాటికలో అయేషా మీరా మృతదేహానికి మరోసారి శవపరీక్ష చేయనున్నారు. కేసును సీబీఐకి అప్పగించినందున ఆధారాల కోసం ఈ నిర్ణయం తీసుకున్నారు.
'అయేషా మీరా హత్య కేసు.. మరోసారి శవపరీక్ష'