తెలంగాణ

telangana

ETV Bharat / city

రోడ్డే ఆవాసం.. ఆకలితో సావాసం - ballari latest news

అందరూ ఉన్నా ఎవ్వరూ లేని అనాథలా జీవిస్తోంది ఈ వృద్ధురాలు. తనను చూసుకోవటం భారంగా ఉందని కన్నకొడుకే రోడ్డుపై పడేసిన అంజలిని ఆదుకునేదెవరు..? తన ఆకలిని తీర్చేదెవరు..?

old-women-living-on-road-side-in-ananthapur-district
రోడ్డే ఆవాసం.. ఆకలితో సావాసం

By

Published : Jun 3, 2020, 8:32 PM IST

ఆంధ్రప్రదేశ్​లో అనంతపురం జిల్లాలోని బళ్లారి బైపాస్‌ రోడ్డు డివైడర్‌పై చిన్న తడికెల నీడలో జీవనం సాగిస్తోంది ఈ వృద్ధురాలు. ఎండొచ్చినా.. వానొచ్చినా అక్కడే గత నెల రోజులుగా ఉంటోంది. ఎవరైనే దాతలు పెడితే నాలుగు మెతుకులు తింటోంది. లేదంటే ఆకలి కడుపుతో... అలాగే నిద్రలోకి జారుకుంటోంది.

నిద్రలో రహదారి మీదకు జారిపడినా.. వాహనాలు అదుపు తప్పి దూసుకొచ్చినా ప్రాణానికే ప్రమాదం. తన పేరు అంజలి అని.. ముగ్గురు పిల్లలని వృద్ధురాలు తెలిపింది. తన కుమారుడే ఇక్కడ వదిలి వెళ్లాడనీ.. వెళ్తూవెళ్తూ తనకు నీడ కోసం తడికెను ఏర్పాటు చేశాడని ఆ వృద్ధురాలు చెప్పింది. తనను బయట పడేసినా.. కన్న ప్రేమతో వారిని నలుగురిలో నవ్వులపాలు చేయకూడదనే ఉద్దేశంతో బాధను కడుపులోనే పెట్టుకొంది.

ఇవీ చూడండి: మానవ హక్కుల కమిషన్​ను ఆశ్రయించిన బాధిత మహిళ

ABOUT THE AUTHOR

...view details