తెలంగాణ

telangana

ETV Bharat / city

వృద్ధులకు కరోనా భయం.. అవగాహన అవసరం

జ్వరమొచ్చినా.. తలనొప్పిగా అనిపించినా.. అదే అనే భయం. సున్నిత మనస్కులను మరింత కలవరపాటుకు గురిచేస్తోంది. వృద్ధులను అయోమయంలోకి నెట్టేసి బలవన్మరణాలకు పురి గొల్పుతోంది. లాక్‌డౌన్‌ వేళ.. మూడు నెలల వ్యవధిలో గ్రేటర్‌ పరిధిలో కరోనా భయంతో నలుగురు ఆత్మహత్య చేసుకున్నారు. వీరిలో ఇద్దరు వృద్ధులు, మరో ఇద్దరు మహిళలున్నారు. వైరస్‌కు సంబంధించిన అనుమానాలు, అపోహలు నివృత్తి చేసేందుకు సరైన యంత్రాంగం లేకపోవటం కూడా దీనికి కారణమని వైద్యనిపుణులు అంచనా వేస్తున్నారు.

committed to suicide
మనోధైర్యం కోల్పోయి బలవన్మరణాలు

By

Published : Oct 6, 2020, 11:03 AM IST

హైదరాబాద్‌ మహానగరంలో కొవిడ్‌19 కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. వైద్యపరీక్షలు చేయించుకుంటున్న వారిలో కేవలం 3-5శాతం మందికి మాత్రమే పాజిటివ్‌ లక్షణాలు బయటపడుతున్నాయి. కొందరు రోజుల తరబడి వదలని జ్వరంతో ఇబ్బంది పడుతూ ఇల్లొదిలి వెళ్లిపోతున్నారు. స్వచ్ఛంద సంస్థలు నిర్వహించే హెల్ప్‌లైన్‌ నంబర్లకు ఫోన్‌చేసి సహాయం కోరుతున్న వారి శాతం నాలుగు నెలల వ్యవధిలో 20 నుంచి 45శాతం పెరగటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. మహిళలు, వృద్ధులు ఎక్కువశాతం ఆందోళనకు గురవుతున్నారు. తమ అనారోగ్యం కారణంగా కుటుంబ సభ్యులకు ఇబ్బందులు వస్తాయని క్షణికావేశంలో ఉసురు తీసుకుంటున్నారు. నార్సింగి ఠాణా పరిధిలో ఓ గృహిణి ఒంటరితనం వల్లే తాను అఘాయిత్యానికి పాల్పడుతున్నట్టు సూసైడ్‌నోట్‌లో పేర్కొన్నారు.

మాట కరవై.. మనసు భారమై

కరోనా లాక్‌డౌన్‌ సమయంలో రోజు 100కు పైగా వచ్చే ఫోన్‌కాల్స్‌లో 70శాతం కేవలం ఒంటరితనం, కరోనా భయాలతో నిద్రకు దూరమవుతున్నామంటూ ఆందోళన వెలిబుచ్చారని రోష్నీ సంస్థ ప్రతినిధి ఒకరు తెలిపారు. ఆ సమయంలో మాట సాయంతో వారిలో ఆత్మస్థైర్యం నింపటం ద్వారా ప్రతికూల ఆలోచనలకు అడ్డుకట్ట వేశామని వివరించారు. కుటుంబ సభ్యుల్లో ఎవరైనా కొవిడ్‌ 19 గురించి పదేపదే భయాందోళనలు వ్యక్తం చేస్తున్నవారికి అవగాహన కల్పించాలని మనస్తత్వ విశ్లేషకులు డాక్టర్‌ మోతుకూరి రాంచందర్‌ సూచించారు. సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్న వదంతులకు దూరంగా ఉంచాలన్నారు.

ఇవీ చూడండి:నిధులు విడుదల కాక ఇబ్బందుల్లో చేనేత కార్మికులు

ABOUT THE AUTHOR

...view details