శంషాబాద్ విమానాశ్రయంలో కిడ్నాప్ కలకలం - అపహరణ
శంషాబాద్ విమానాశ్రయంలో కిడ్నాప్ కలకలం సృష్టించింది. ముగ్గురు చిన్నారులను అపహరించేందుకు క్యాబ్ డ్రైవర్ యత్నించాడు. గమనించిన తల్లిదండ్రులు వెంబడించగా పిల్లల్ని వదిలేసి పరారయ్యాడు.
శంషాబాద్ విమానాశ్రయంలో చిన్నారుల కిడ్నాప్ కలకలం రేపింది. ముంబయి నుంచి హైదరాబాద్ వచ్చిన ఓ కుటుంబం తమ కారులో స్థలం లేకపోవడం వల్ల ఓలా క్యాబ్‌ను ఆశ్రయించింది. క్యాబ్‌లో ఇద్దరు అబ్బాయిలు, ఒక అమ్మాయి ఎక్కారు. వారి తల్లిదండ్రులు వెళ్తున్న కారును ఫాలో చేయమని డ్రైవర్‌కు చెప్పారు. క్యాబ్ డ్రైవర్ కారు మధ్యలో ఆపి తన స్నేహితుడిని ఎక్కించుకున్నాడు. కారును వేగంగా నడపడం వల్ల భయపడిన పిల్లలు తల్లిదండ్రులకు సమాచారం అందించారు. వారు క్యాబ్‌ను వెంబడించి పట్టుకున్నారు. డ్రైవర్‌ను నిలదీయగా పిల్లల్ని అక్కడ వదిలేసి పరారయ్యాడు. అతని స్నేహితుడిని పట్టుకుని శంషాబాద్ పీఎస్‌లో అప్పగించారు.
- ఇదీ చూడండి : మంత్రి నిరంజన్‌రెడ్డి మాతృమూర్తికి కేసీఆర్ నివాళి