వరదలతో రాష్ట్రవ్యాప్తంగా 50 మంది మృతి.. సీఎంకు అధికారుల నివేదిక - ముఖ్యమంత్రి కేసీఆర్కు నివేదిక సమర్పించిన అధికారులు
20:17 October 15
వరదలతో రాష్ట్రవ్యాప్తంగా 50 మంది మృతి.. సీఎంకు అధికారుల నివేదిక
వరదలతో రాష్ట్రవ్యాప్తంగా జరిగిన నష్టంపై అధికారులు ముఖ్యమంత్రి కేసీఆర్కు నివేదిక సమర్పించారు. రాష్ట్రవ్యాప్తంగా 50 మంది మరణించినట్టు వివరించారు. జీహెచ్ఎంసీ పరిధిలోనే 11 మంది మృతి చెందినట్లు తెలిపారు.
రాష్ట్రంలో 7.35 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్టు ప్రాథమిక నివేదికలో పేర్కొన్నారు. దెబ్బతిన్న పంటల్లో కనీసం సగం పంటలకు లెక్కించినా... రూ.2 వేల కోట్ల నష్టం వాటిల్లినట్టు అంచనా వేశారు.
ఇదీ చూడండి:వరదలపై సీఎం కేసీఆర్ సమీక్ష.. రూ. 5వేల కోట్ల నష్టం అంచనా