ముఖ్యమంత్రి కేసీఆర్‌పై భాజపా నేత మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ విమర్శలు గుప్పించారు. గతంలో అలె నరేంద్ర, విజయశాంతి, స్వామిగౌడ్‌లను బయటకు పంపించారని... ఇప్పుడు ఈటల రాజేందర్ వంతు వచ్చిందని అన్నారు.
NVSS Prabhakar: ఈటల వంతు అయిపోయింది.. ఇక మిగిలింది హరీశ్! - ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్
ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ఆరోపణలు చేశారు. ఈటల రాజేందర్‌ను బయటకు పంపించారని.. ఇక మిగిలింది హరీశ్‌రావు అని వెల్లడించారు. తెరాస రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యమకారులు ఎందుకు పార్టీని వీడుతున్నారని ప్రశ్నించారు.
జూమ్ ద్వారా మీడియా సమావేశంలో మాట్లాడిన ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్.. సీఎం కేసీఅర్‌పై పలు ఆరోపణలు చేశారు. ఇక మిగిలింది హరీశ్‌రావు అని అనుమానం వ్యక్తం చేశారు. తెరాస రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యమకారులు ఎందుకు పార్టీని వీడుతున్నారని ప్రశ్నించారు. ప్రభుత్వం తన పని చేయకుండా.. రాజకీయం చేస్తోందని ఆక్షేపించారు. ఉద్యమంలో లేనివారు పదవులు అనుభవిస్తున్నారని.. ఆరోపించారు. అవినీతి ఆరోపణలు వచ్చిన ఎమ్మెల్యేలు, మంత్రులపై సిట్టింగ్ జడ్జిల చేత విచారణ ఎందుకు చేయించడం లేదని అన్నారు. తెలంగాణలో రాజకీయ సమీకరణాలు కొత్త పుంతలు తొక్కుతున్నాయని పేర్కొన్నారు.
ఇదీ చూడండి: 'కుటుంబ ఆత్మహత్య అనుమానాస్పద మృతిగా ప్రాథమిక నిర్ధరణ'