తెలంగాణ

telangana

ETV Bharat / city

అనుకోని అస్వస్థతతో విలవిల: 300 మందికి పైగా ఆస్పత్రిపాలు - వందల సంఖ్యలో ఆస్పత్రుల్లో చేరుతున్న ఏలూరు వాసులు

నోటి నుంచి నురగరావడం, వాంతులు చేసుకోవడం, మూర్ఛపోవడం.. ఇలాంటి లక్షణాలతో ఏలూరులో రెండో రోజూ పెద్ద సంఖ్యలో జనం ఆసుపత్రిలో చేరారు. దాదాపు 300మందికి పైగా ప్రజలు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. అంతుచిక్కని అనారోగ్య సమస్యలతో.. ఏలూరు వాసులు ఆందోళన చెందుతున్నారు. బాధితులకు వైరల్, బ్యాక్టీరియల్, కొవిడ్, నీటి, సిటిస్కాన్ సహా అన్ని పరీక్షలు నిర్వహించినా.. ఎక్కడా వ్యాధి నిర్థారణకు సంబంధించిన ఆనవాళ్లు వైద్యులకు కనిపించకపోవడం కలకలం రేపుతోంది.

అనుకోని అస్వస్థతతో విలవిల: 300 మందికి పైగా ఆస్పత్రిపాలు
అనుకోని అస్వస్థతతో విలవిల: 300 మందికి పైగా ఆస్పత్రిపాలు

By

Published : Dec 6, 2020, 11:12 PM IST

ఆంధ్రప్రదేశ్​లోని పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు ప్రజలు.. అంతుచిక్కని వ్యాధితో అస్వస్థతకు గురవుతున్నారు. రెండు రోజులుగా ఆసుపత్రులకు వెళుతున్న వారి సంఖ్య పెరిగింది. మూర్ఛ, వాంతులు, కళ్లు తిరగడం, నోటి నుంచి నురగరావడం వంటి లక్షణాలతో.. ఉదయం నుంచి పెద్ద సంఖ్యలో బాధితులు ఆసుపత్రుల్లో చేరారు. వీరిలో అన్ని వయసుల వారూ ఉన్నారు. ఏలూరు ఒకటో పట్టణ పరిధిలోని దక్షిణ వీధిలో ఈ అంతుచిక్కని వ్యాధి శనివారం ఉదయం మొదట వెలుగుచూసింది. రాత్రి అయ్యే సరికి మిగిలిన కాలనీల్లోకి విస్తరించింది. పదుల సంఖ్యలో ఉన్న కేసులు.. చూస్తుండగానే వందల్లోకి చేరాయి. ఇప్పటికే ఓ వ్యక్తి మరణించగా.. అస్వస్థతకు కారణాలు తెలుసుకొని త్వరగా పరిష్కార మార్గాలు తెలుసుకోవాలని ఏలూరు వాసులు కోరుతున్నారు.

అనుకోని అస్వస్థతతో విలవిల: 300 మందికి పైగా ఆస్పత్రిపాలు

వైద్యులేమంటున్నారు..?

అనారోగ్యం పాలైనవారిలో అందరి పరిస్థితి నిలకడగానే ఉంది. ఎలాంటి ప్రాణాపాయం లేదు. ఏలూరు ఆసుపత్రిలో 227 మంది చికిత్స తీసుకున్నారు. మరో వందమందికి పైగా ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందారు. ఐదుగురికి మూర్ఛ తరుచూ వస్తున్నందున.. వారిని విజయవాడ ఆసుపత్రికి తరలించాం. 87 మందిని డిశ్చార్జి చేశాం. అందరి ఆరోగ్య పరిస్థతి మెరుగ్గా ఉంది. - మోహన్, డీసీహెచ్ఎస్

బాధితులను పరామర్శించిన మంత్రి:

ఏలూరు నగరంలో ప్రజల ‌అస్వస్థతకు కారణాలు నిర్ధారణ కాలేదు. బాధితులకు అని పరీక్షలు నిర్వహించారు. అన్ని ఫలితాలు సాధారణంగానే వచ్చాయని వైద్యులు తెలిపారు. ఎలాంటి వైరస్‌ బయట పడలేదు. ఆసుపత్రిలో చేరిన వారందరికీ కొవిడ్ పరీక్షలు నిర్వహించగా.. ఫలితాలు నెగిటివ్‌గా తేలాయి. మూర్ఛ లక్షణంతో వచ్చిన వారికి సిటీస్కాన్ చేసినా ఎలాంటి లక్షణాలు బయట పడలేదు. నీటి పరీక్షలు నిర్వహించినా ఎలాంటి కలుషిత లక్షణాలు లేవు. - ఆళ్ల నాని, వైద్య ఆరోగ్యశాఖమంత్రి

ఇదీ చదవండి:కొడుకులు చూస్తుండగానే తల్లి ఆత్మహత్య... కారణమేంటీ?

ABOUT THE AUTHOR

...view details