సీఏఏ, ఎన్నార్సీలకు వ్యతిరేకంగా భారత్‌లో నిరసన జ్వాలలు వెల్లువెత్తుతుండగా... యూఎస్‌లోని వివిధ నగరాల్లో వీటికి మద్దతుగా ఎన్నారైలు భారీ ర్యాలీ నిర్వహించారు. సీఏఏ, ఎన్నార్సీల చుట్టూ అలుముకున్న తప్పుడు సమాచారం, అపోహలను తొలగిద్దామని ఈ సందర్భంగా ఎన్నారైలు నినాదించారు. సీఏఏ, ఎన్నార్సీల వెనుక ఉన్న వాస్తవాలను తెలుసుకోకుండా కొందరు కావాలనే నిరసనలు చేపడుతున్నారని దుయ్యబట్టారు. అపోహలను తొలగించాలని యూఎస్‌లోని వివిధ నగరాలలో ఎన్నారైలు ర్యాలీలు నిర్వహించారు.
సీఏఏ, ఎన్నార్సీలకు మద్దతుగా యూఎస్‌లో ఎన్నారైల ర్యాలీ - america
యూఎస్‌లోని వివిధ నగరాల్లో సీఏఏ, ఎన్నార్సీలకు మద్దతుగా ఎన్నారైలు భారీ ర్యాలీ నిర్వహించారు. సీఏఏ, ఎన్నార్సీల వెనుక ఉన్న వాస్తవాలను తెలుసుకోకుండా కొందరు కావాలనే నిరసనలు చేపడుతున్నారని దుయ్యబట్టారు.
సీఏఏ, ఎన్నార్సీలకు మద్దతుగా యూఎస్‌లో ఎన్నారైల ర్యాలీ
దీనిలో భాగంగా న్యూయార్క్ టైం స్క్వేర్ ముందు ప్రొ-సీఏఏ ర్యాలీ చేపట్టారు. కాలిఫోర్నియాలో బే ఏరియా వద్ద కూడా ర్యాలీ నిర్వహించారు. భాజపా అమెరికా అధ్యక్షుడు కృష్ణారెడ్డి ఏనుగుల, భాజపా నేషనల్ యూత్ కో- కన్వీనర్ విలాస్ రెడ్డి జంబుల, చికాగో నుంచి భరత్ బారాయి, కాలిఫోర్నియా నుంచి సతీశ్, న్యూయార్క్ నుంచి శివదాసాన్ నాయర్ ఈ ర్యాలీలో పాల్గొన్నారు.
ఇవీ చూడండి: సంస్కరణలకు కట్టాలి పట్టం.. ఇదే ప్రధాని తక్షణ కర్తవ్యం!