తెలంగాణ

telangana

ETV Bharat / city

టీ హబ్​లో ఎన్​​పీసీఐ ఇన్నోవేషన్​ ల్యాబ్​ ప్రారంభం - టీ హబ్​లో ఎన్​​పీసీఐ ఇన్నోవేషన్​ ల్యాబ్​ ప్రారంభం

టీ-హబ్​లో ఏర్పాటు చేసిన ఎన్​పీసీఐ ఇన్నోవేషన్​ ల్యాబ్​ను ఐటీ, పరిశ్రమల ముఖ్య కార్యదర్శి జయేశ్​​ రంజన్​ ప్రారంభించారు.

NPCI STARTED INNOVATION LAB IN T HUB
టీ హబ్​లో ఎన్​​పీసీఐ ఇన్నోవేషన్​ ల్యాబ్​ ప్రారంభం

By

Published : Nov 26, 2019, 7:00 PM IST

నేషనల్​ పేమెంట్స్​ కార్పొరేషన్​ ఆఫ్​ ఇండియా (ఎన్​పీసీఐ) తన ఇన్నోవేషన్​ ల్యాబ్​ను టీ-హబ్​లో ప్రారంభించింది. ట్రాన్సాక్షన్​ నెక్ట్స్​ హబ్​లో ఏర్పాటైన ల్యాబ్​ను రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్​​ రంజన్​ ప్రారంభించారు. కేవలం ఆరు నెలల్లోనే ల్యాబ్​ను ప్రారంభించడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఎన్​పీసీఐ, సైన్స్​ అండ్​ టెక్నాలజీ విభాగం భాగస్వామ్యంతో టీ-హబ్​ నిర్వహించనున్న ఫిన్​టెక్​ యాక్సలేటర్​ ప్రొగ్రాంను కూడా జయేశ్​​ రంజన్​ ప్రారంభించారు. నేటి నుంచి జనవరి 5 వరకు ఈ ప్రోగ్రాం కోసం దరఖాస్తు చేసుకోవచ్చని టీ-హబ్​ ప్రకటించింది.

టీ హబ్​లో ఎన్​​పీసీఐ ఇన్నోవేషన్​ ల్యాబ్​ ప్రారంభం

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details