Telangana Fire Department Recruitment : అగ్నిమాపక శాఖలో 225 డ్రైవర్ ఆపరేటర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. రాష్ట్ర పోలీసు నియామక మండలి ఈ మేరకు శుక్రవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు అర్హులైన అభ్యర్థుల నుంచి మే 21వ తేదీ ఉదయం 8 గంటల నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపింది. మే 26 రాత్రి 10 గంటల వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించింది.
అగ్నిమాపక శాఖలో 225 డ్రైవర్ ఆపరేటర్ పోస్టుల భర్తీ - Telangana Fire Department Recruitment
Telangana Fire Department Recruitment : రాష్ట్ర అగ్నిమాపక శాఖలో 225 డ్రైవర్ ఆపరేటర్ పోస్టులు భర్తీ కానున్నాయి. ఈమేరకు రాష్ట్ర పోలీసు నియామక మండలి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనికి కనీస విద్యార్హత ఇంటర్మీడియట్ అని వివరించింది. అర్హులైన వారు మే 21 నుంచి మే 26 రాత్రి 10 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది.
Telangana Fire Department Recruitment
కనీస విద్యార్హత ఇంటర్మీడియట్ అని వివరించింది. వయసు జులై 1, 2022 నాటికి 21 ఏళ్ల నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి. అయితే గరిష్ఠ వయో పరిమితి అయిదేళ్లు పెంచుతున్నట్లు తెలిపింది. ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేయాలని స్పష్టం చేసింది. దరఖాస్తులు అందుబాటులో ఉంటాయని పేర్కొంది. నోటిషికేషన్ తేదీ నాటికి రెండేళ్లు.. అంతకంటే ముందు హెవీ మోటర్ వెహికిల్ లైసెన్స్ పొంది ఉండాలి. రిజర్వేషన్, తదితర పూర్తి వివరాలు వెబ్‌సెట్‌లో ఉన్నాయని పేర్కొంది.